Videos

Pawan Kalyan Thanks His Overseas Fans


1 year ago

ఒకప్పుడు విదేశాల్లో తెలుగు సినిమా రిలీజ్ అవ్వటమే గగనం అటువంటిది, ఇప్పుడు తెలుగు సినిమా విదేశాల్లో కోట్లు వసూళ్లు చేసే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలైతే ఓవర్ సీస్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ కి సినిమాలకు కూడా గట్టి పోటి ఇస్తుంది. తాజాగా విడుదలకు సిద్దమవుతోన్న పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమాకు భారీ ఎత్తున ఓవర్ సీస్ లో రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ సినిమా పాత  రికార్డులన్ని  బ్రేక్ చేసే అవకాశం వుంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఓవర్ సీస్ లోని తన అభిమానులను ఉద్దేశించి ఓ సందేశమిచ్చారు.

 

విదేశాల్లో ఉన్న తెలుగువారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉన్న ఊరిని వదిలి పక్క ఊరికి వెళ్లి పనిచేయడమే చాలా కష్టం. అటువంటిది రాష్ట్రం,దేశం వదిలి  చదువు కోసం, ఉద్యోగం కోసం దేశం కాని దేశంలో  మీరు పడుతున్న కష్టాలేంటో  నాకు తెలుసు.ఆత్మ గౌరవం కోసం అక్కడ స్థానికత కోసం మీరు పడే ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు.అక్కడ మీకేం జరిగిన అండగా నిలబడటానికి ఇక్కడ కోట్ల మంది వున్నారు. నా చిత్రాలను ఆదరిస్తున్న మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.18 ఏళ్ల క్రితం బద్రి సినిమా సినిమా కొన్ని సెంటర్లలో రిలీజ్ అయితేనే పెద్ద విజయంగా భావించాం.అలాంటిది భారతీయ సినిమాల్లో దేనికి ఇవ్వనన్ని దియాటర్స్ అజ్ఞాతవాసి సినిమాకు ఇస్తుండటం చాలా సంతోషంగా వుంది.పవన్ సందేశం పట్ల ఫిదా అయిపోయిన ఫ్యాన్స్ సినిమాను పెద్ద హిట్ చేసి ఆయనకు కానుకగా ఇవ్వాలనుకుంటున్నారు.త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుంది.