సినిమా వార్తలు

జ‌న‌వ‌రి 11న 'విన‌య విధేయ రామ‌'


8 months ago జ‌న‌వ‌రి 11న 'విన‌య విధేయ రామ‌'

'మెగా పవర్ స్టార్' రామ్ చ‌ర‌ణ్‌, బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కించిన చిత్రం 'విన‌య విధేయ రామ‌'. మాస్ డైరెక్టర్ బోయ‌పాటి శీను ఈ చిత్రాన్ని రూపొందించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చిత్రంలో హీరోలు వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్‌, ఆర్యన్ రాజేశ్‌, మరియు హీరోయిన్ స్నేహ ప్రధాన పాత్రల్లో న‌టించారు. బాలీవుడ్ బామ ఇషా గుప్తా ప్ర‌త్యేక గీతంలో నర్తించింది. 'విన‌య విధేయ రామ‌' సినిమా సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానుంది. చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్‌ని ఇటీవ‌ల విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌లో చరణ్ మాస్ డైలాగ్ లతో ఆకట్టుకున్నాడు. ట్రైల‌ర్‌కి విశేష స్పంద‌న ల‌భించింది. కోటి వ్యూస్ లభించాయి. దీనికి సంబంధించిన పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.