సినిమా వార్తలు

17న ‘టాక్సీవాలా’


11 months ago 17న ‘టాక్సీవాలా’

‘గీత గోవిందం’ చిత్రంతో విజయ్‌ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్న చిత్రం ‘టాక్సీవాలా’. సస్పెన్స్‌, సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. షూటింగ్‌ షూర్తి చేసుకొని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకొంటున్న ఈ సినిమా నవంబర్‌ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఎస్‌.కె.ఎన్‌. మాట్లాడుతూ ‘విజయ్‌ ఇమేజ్‌కి తగ్గట్లుగా, అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా సినిమాను దర్శకుడు రాహుల్‌ రూపొందించారు. విజయ్‌ మేనరిజమ్స్‌ యూత్‌ను బాగా ఆకట్టుకొంటాయి.

సినిమాలో గ్రాఫిక్స్‌ చాలా కీలకంకానున్నాయి. బెటర్‌ క్వాలిటీ గ్రాఫిక్స్‌ కోసమే ఈ చిత్రం విడుదల కాస్త ఆలస్యం అయింది. వచ్చే నెల 16న అత్యధిక థియేటర్వలో విడుదల చేస్తాం’ అని తెలిపారు. ప్రియాంక జవాల్కర్‌, మాళవికా నాయర్‌, కల్యాణి, మధునందన్‌, సిజ్జు మీనన్‌, రవిప్రకాశ్‌, ఉత్తేజ్‌, రవివర్మ తదితరులు ఈ చిత్రంలో నటించారు ఈ చిత్రానికి మాటలు, స్ర్కీన్‌ప్లే! సాయికుమార్‌ రెడ్డి, సంగీతాన్ని జేక్స్‌ బిజాయ్‌ అందించారు.