సినిమా వార్తలు

21న సుధీర్ బాబు ‘నన్నుదోచుకొందువటే’


1 year ago 21న సుధీర్ బాబు  ‘నన్నుదోచుకొందువటే’

హీరో సుధీర్ బాబు నిర్మాతగా మారి సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. లవ్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్ ఇటీవల బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాప్ చేతులు మీదుగా విడుదలైంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆర్ ఎస్ నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథ, స్క్రీన్, ప్లే దర్శకత్వం బాధ్యతల్ని ఆయనే తీసుకున్నారు.

ఎన్టీఆర్ ‘గులేబకావళి’ సినిమాలో ‘నన్నుదోచుకుందువటే’ఎవర్ గ్రీన్ సాంగ్ లైన్‌ని తన చిత్రానికి టైటిల్‌గా పెట్టుకుని ఫస్ట్ ఇంప్రెషన్ రాబట్టిన సుధీర్ బాబు ఫీల్ గుడ్ మూవీని అందిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ట్రైలర్‌లో సుధీర్ బాబు డిఫెరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తున్నాడు. సాఫ్ట్‌వేర్ కంపెనీకి మేనేజర్‌గా స్టాఫ్ మొత్తాన్ని సీరియస్‌ లుక్స్‌తో బెదరగొట్టేస్తున్నాడు. ఇక అదే ఆఫీస్‌లో అల్లరి పిల్లగా నభా నటేష్ సందడి చేస్తుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.