సినిమా వార్తలు

సెప్టెంబర్ 13THన సమంత ‘యూ ట‌ర్న్’


1 year ago సెప్టెంబర్ 13THన సమంత ‘యూ ట‌ర్న్’

స‌మంత మొదటిసారిగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించింది. అదే ‘యూ ట‌ర్న్’‌. క‌న్న‌డ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. స‌మంత సినిమా కావడంతో మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. విడుద‌ల‌కు ముందే సినిమా అమ్ముకునే ఛాన్స్‌ ద‌క్కింది. రూ.6 కోట్ల‌కు సురేష్ రెడ్డి ఈ సినిమా ఆంధ్రా, తెలంగాణ థియేట‌రిక‌ల్ రైట్స్ సొంతం చేసుకున్నారు. శాటిలైట్ ఇంకా విక్రయం కావాల్సివుందని తెలుస్తోంది. స‌మంత పారితోషికంతో క‌ల‌పి రూ.14.5 కోట్ల‌తో ఈ సినిమా రూపొందించారని తెలుస్తోంది. ప‌బ్లిసిటీకి మ‌రో కోటి రూపాయ‌లు ఖర్చయ్యిందనుకున్నా రూ.15.5 కోట్ల‌లో ఈసినిమా పూర్త‌యిన‌ట్టు అంచనా. త‌మిళంలో ఎంత కాద‌న్నా మ‌రో ఆరు నుంచి ఏడు కోట్లు అందుతాయంటున్నారు.

ఇక తెలుగు, త‌మిళంలో శాటిలైట్ అమ్మాల్సివుంది. రెండూ క‌లుపుకుంటే క‌నీసం రూ.5 కోట్ల వ‌ర‌కూ రావొచ్చు. అంటే విడుద‌ల‌కు ముందే.. యూట‌ర్న్‌కి లాభాలొచ్చాయ‌ని సమాచారం‌. బీ,సీ సెంట‌ర్లోల ఈ సినిమాకి ఎలాంటి వ‌సూళ్లు ఉంటాయో అంచనా లేనప్పటికీ మ‌ల్టీప్లెక్స్‌లో మాత్రం టికెట్లు బాగానే వస్తాయని తెలుస్తోంది. మాస్‌లో స‌మంత‌కు ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకి క‌లిసొచ్చే అంశంగా తెలుస్తోంది. కాగా కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ మూవీని తెలుగులో అదే పేరుతో ఒరిజినల్ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో సెప్టెంబ‌ర్ 13న భారీ విడుదలకు రెడీ అయ్యింది.