సినిమా వార్తలు

సెప్టెంబర్ 13thన ‘శైలజారెడ్డి అల్లుడు’


1 year ago సెప్టెంబర్ 13thన  ‘శైలజారెడ్డి అల్లుడు’

నాగచైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. నాగచైతన్య అత్తగా ప్రముఖ నటి రమ్యకృష్ణ నటించారు. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై తెరకెక్కిన మూడో చిత్రం ఇది. అలాగే నాగచైతన్య 16వ చిత్రం. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, కళ్యాణి నటరాజన్, శరణ్య, పృథ్వి, రఘుబాబు, రాహుల్ రామకృష్ణ ఇతర పాత్రల్లో నటించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి నిజర్ షఫీ ఛాయాగ్రహణం అందించారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరించారు.