సినిమా వార్తలు

21న ‘పడి పడి లేచే మనసు’


9 months ago 21న ‘పడి పడి లేచే మనసు’

శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన ‘పడి పడి లేచే మనసు’ సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా రొమాంటిక్ లవ్ స్టోరీగా నిర్మితమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. హృదయం జరిపే అంటూ సాగే ఈ పాట యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా వుంది. ''నువ్వు నడిచే ఈ నేలపైనే.. నడిచానా ఇన్నాళ్లుగానే.." అంటూ సాగే లిరిక్స్ బాగున్నాయి. మిడిల్ క్లాస్ అబ్బాయి హిట్ తర్వాత ఈ సినిమా ద్వారా సాయిపల్లవి మంచి మార్కులు కొట్టేయాలని భావిస్తోంది. ఈ సినిమాపై శర్వానంద్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ధాకర్‌ చెరుకూరి, ప్రసాద్‌ చుక్కపల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కొల్‌‌కతా బ్యాక్ డ్రాప్‌గా సాగే ఈ ప్రేమకథ ఇదని, నేపాల్‌‌లో కూడా షూటింగ్ జరిగిందని సమాచారం. విశాల్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తుండగా సునీల్ గెస్ట్ రోల్‌ లో కనిపించనున్నారు.