సినిమా వార్తలు

డిసెంబర్ 28న నిఖిల్ 'ముద్ర'


11 months ago డిసెంబర్ 28న నిఖిల్ 'ముద్ర'

టాలీవుడ్ హీరో నిఖిల్ తాజా చిత్రంగా 'ముద్ర'. టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా షూటింగుతో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తూ వస్తున్న్టట్లు సమాచారం. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, డిసెంబర్ 28 తేదీన విడుదల చేయనున్నారు.

విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నిఖిల్ కొత్త లుక్ తో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా తనకుతప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు. ఇక ఈ మధ్య రేస్ లో వెనుకబడిన లావణ్య త్రిపాఠి కూడా ఈ సినిమా హిట్ తనకి చాలా అవసరమని భావిస్తోందని సమాచారం.