రాబోయే సినిమాలు

త్వరలో రాబోతున్న 'లాలిజో లాలిజో' మూవీ


2 years ago త్వరలో  రాబోతున్న 'లాలిజో లాలిజో' మూవీ

 

ఎటువంటి స్టార్ కాస్ట్ లేకపోయిన అందరు కొత్త వాళ్ళతో తీసిన సినిమా ‘లాలిజో లాలిజో’ ఒక స్టార్ హీరో సినిమాలో ఎంత అద్బుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ వుంటాయో ఎంత మంచి కాన్సెప్ట్ వుంటుందో దానికి ఏమాత్రం తీసిపోకుండా అంతే అద్బుతమైన  ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇంతవరకు మన ఇండియన్ స్క్రీన్స్ పైన రానటువంటి ఒక అత్యద్బుతమైన  కాన్సెప్ట్ తో లాలిజో లాలిజో అంటూ మీ ముందుకు వచ్చేస్తుంది . రీసెంట్ గా రిలీజ్ అయిన  ఈ సినిమా ట్రైలర్ కి చాలా మంచి స్పందన వచ్చింది.

 

ఎవరైనా సరే వాళ్ళకి మొదటి అవకాసం వస్తే ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అదే ఒక టీం లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి మొదటి ఛాన్స్ అయితే అందరు ఎంతో కసిగా వాళ్ళ పీక్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. అటువంటి టీం తో వస్తున్న మూవీ లాలిజో లాలిజో ఇందులో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ మూవీ నే డెబ్యు.  డైరెక్టర్ ,ప్రొడ్యూసర్ ,సౌండ్ డిజైనర్ ,మ్యూజిక్ డైరెక్టర్ ,ఫోటో గ్రాఫర్ ఇలా ప్రతి ఒక్కరికి ఇదే మొదటి సినిమా. ఈ ఒక్కటి చాలు ఈ మూవీని  అద్బుతంగా తీసివుంటారని గట్టిగ నమ్మవచ్చు. ఒడిస్సా లో పవర్ స్టార్ గా పిలవబడుతున్న సంబీత్ ను,నీహా రత్నాకరన్ అనే మలయాళీ భామను తెలుగు తెరకు పరిచయం చేస్తూ, జై శ్రీ సంతోషి మాతా ప్రొడక్షన్స్ లో శంకు,కిరణ్ నిర్మిస్తున్న ఈ లాలిజో లాలిజో చిత్రానికి మోహన్ శ్రీవాత్స అనే కొత్త వ్యక్తి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమాకు మెలోడీ శ్రీనివాస్ సంగీతం అందించగా,మురళి కృష్ణ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.