సినిమా వార్తలు

జనవరి 12న ‘ఎఫ్2’


10 months ago జనవరి 12న ‘ఎఫ్2’

మెగాహీరో వరుణ్ తేజ్, విక్టరీ వెంకటేష్ కలిసి చేస్తున్న సినిమా ఎఫ్2. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. వెంకీ, వరుణ్ తోడల్లుగా నటిస్తున్న ఎఫ్2లో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  సంతోషంగా ఉండే ఒక మగాడి జీవితంలో పెళ్లి ఎలాంటి మార్పులు తెస్తుంది, ఒక వ్యక్తిని ఎలాంటి కష్టాలు పెడుతుంది అనే కథాంశంతో వస్తున్న ఎఫ్2 సినిమా కథని టీజర్ లో చూపించారు. తరువాత బ్యాచులర్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్తూ ఒక వీడియో సాంగ్ విడుదల చేశారు. రెచ్చిపోదాం అంటూ మొదలైన ఈ సాంగ్ చాలా క్యాచీగా ఉంది. గతంలో పెళ్లి వద్దురా అంటూ ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ చాలా రోజుల తర్వాత పెళ్లి కానీ యూత్ కి సూపర్ గా సెట్ అయ్యే సాంగ్ ని ఇచ్చాడు. మంచి ఎనర్జీతో ఈ సాంగ్ లో కనిపించిన వెంకీ, వరుణ్ కి రాజేంద్ర ప్రసాద్ కూడా తోడవడంతో మరింత నవ్వులు పూయించారు.