సినిమా వార్తలు

14న దుల్కర్, నిత్యామీనన్‌ల ‘జనతా హోటల్’


1 year ago 14న దుల్కర్, నిత్యామీనన్‌ల ‘జనతా హోటల్’

హీరో మమ్ముట్టి కుమారుడు దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం ఉస్తాద్ హోట‌ల్‌. మ‌ల‌యాళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని సురేష్ కొండేటి తెలుగులో ‘జ‌న‌తా హోట‌ల్’ పేరుతో సెప్టెంబ‌ర్ 14న విడుద‌ల చేయ‌నున్నారు. సురేష్ కొండేటి నిర్మించిన ప్రేమిస్తే, షాపింగ్ మాల్, జ‌ర్నీ వంటి సినిమాలకి మంచి ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. నిత్యామీన‌న్ క‌థానాయిక‌గా న‌టించింది.

ఇటీవలే టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో తండ్రికి వ‌రుస‌గా న‌లుగురు ఆడ‌పిల్ల‌లు పుట్ట‌డం, అయిన ఆశ‌తో అబ్బాయి కోసం ఎదురు చూడ‌డం, చివరికి ఐదో సంతానంగా అబ్బాయి పుట్ట‌డం, పుట్టిన పిల్లాడు తండ్రికి న‌చ్చ‌కుండా సొంత నిర్ణ‌యాలు తీసుకోవ‌డం.. చివ‌రికి పెళ్లి చూపుల్లో... క్వాలిఫికేష‌న్ ఏంట‌ని అమ్మాయి అడిగినపుడు విదేశాల‌లో చెఫ్ కోర్సు చేసాన‌ని చెప్ప‌డం.. ఇలా పలు ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో టీజ‌ర్‌ని రూపొందించి విడుద‌ల చేశారు. ఇది ప్రేక్షకులను ఆక‌ట్టుకునేలా ఉంది.