సినిమా వార్తలు

27న నాని, నాగార్జున ‘దేవదాస్’


1 year ago 27న నాని, నాగార్జున ‘దేవదాస్’

దేవ్‌ ఓ మాఫియా డాన్‌. అలాగని ఎప్పుడూ చేతిలో గన్ను పట్టుకుని తిరగడు. జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో అతనికి బాగా తెలుసు. దాసు ఓ చెట్టుకింద డాక్టరు. పేషెంట్లే కాదు, తనకొచ్చే పేమెంట్లు కూడా తక్కువే. కానీ సరదాలు, సంతోషాలకు కొదవ లేదు. అలాంటి దాసుకి.. దేవ్‌తో కలసి ప్రయాణం చేయాల్సివస్తుందిది. కారణమేంటి? ఆ తరవాత ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే ‘దేవదాస్‌’ చూడాల్సిందే. నాగార్జున, నాని కథానాయకులుగా నటించిన చిత్రమిది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. అశ్వనీదత్‌ నిర్మాత. రష్మిక, ఆకాంక్ష సింగ్‌ కథానాయికలు. ఈనెల 27న ఈ చిత్రం విడుదల కానుంది. ఇటీవలే ఫస్ట్‌లుక్, టీజర్‌ విడుదల చేశారు. వాటికి వచ్చిన స్పందనపై  చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చారు.