సినిమా వార్తలు

డిసెంబర్ 14న ‘భైరవ గీత'


9 months ago డిసెంబర్  14న ‘భైరవ గీత'

ఒకవైపు దర్శకుడిగా, మరోవైపు నిర్మాతగా రామ్ గోపాల్ వర్మ ఎంచుకునే కథలు విభిన్నంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. అందుకే ఆయన సినిమాలపై అందరూ ఆసక్తిని చూపుతుంటారు. ఆయన సినిమాలు వరుసగా పరాజయాలపాలైనా ఆ తరువాత సినిమాలపై ఆత్రుతను వ్యక్తిపరుస్తుంటారు. వర్మ నిర్మాణ సారధ్యంలో రూపొందిన 'భైరవగీత' కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిసోంది. ఈ సినిమాను డిసెంబర్ 14 తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. కన్నడ నటుడు ధనుంజయ హీరోగా సిద్ధార్థ రూపొందించిన ఈ సినిమా, రాయలసీమ నేపథ్యంలోని ప్రేమకథగా నిర్మితమైంది. వర్మ టేస్టుకి తగిన సినిమా కావడంతో, ఆయన మార్కు సినిమాగానే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.