రాబోయే సినిమాలు

మే 1న ‘అర్జున్ సురవరం’


9 months ago మే 1న ‘అర్జున్ సురవరం’

హీరో నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టీఎన్‌ సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. బి. మధు అర్జున్‌ సమర్పణలో ఔరా సినిమాస్‌ పీవీటి, మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్‌ దీనిని నిర్మించారు. ఈ చిత్రానికి ముందుగా ‘ముద్ర’ అనే టైటిల్‌ అనుకున్నారు. అయితే ఆ టైటిల్‌ను ‘అర్జున్‌ సురవరం’గా చిత్ర యూనిట్ మార్పు చేసింది. ‘‘ఈ సినిమాలో నిఖిల్‌ జర్నలిస్ట్‌ పాత్రలో నటించారు. ఇటీవలే యూరప్‌లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ముమ్మరంటా జరుగుతున్నాయి. మార్చి 29న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని చిత్రవర్గం తెలియజేసింది. ఈ చిత్రానికి శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని సమకూర్చారు.