సినిమా వార్తలు

21న అర్జున్‘కురుక్షేత్రం’


1 year ago 21న అర్జున్‘కురుక్షేత్రం’

యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ నటించిన 150వ సినిమా ‘కురుక్షేత్రం’. అరుణ్‌ వైద్యనాథన్‌ దర్శకుడు.  ప్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో ఉమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘నిబునన్‌’ చిత్రాన్నే శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శ్రీనివాస్‌ మీసాల వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న ‘కురుక్షేత్రం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ధర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌ మాట్లాడుతూ... క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది అని అన్నారు. దాదాపు 200కు పైగా థియేటర్స్‌లో మా చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నాం. అర్జున్‌ 150వ సినిమాని మా బ్యానర్‌లో రిలీజ్‌ చేయడం హ్యాపీగా ఉందని  అన్నారు‌. అర్జున్‌ సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించేవన్నీ ‘కురుక్షేత్రం’లో ఉంటాయని సహ నిర్మాత సాయికృష్ణ పెండ్యాల అన్నారు.