సినిమా వార్తలు

21న వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’


9 months ago 21న వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’

బాలీవుడ్ సినిమా ‘ఘాజీ’ సినిమాలో సబ్‌మెరైన్‌తో యుద్ధం ఎలా చేస్తారో ఓ థ్రిల్లర్ రూపంలో సంకల్ప్‌రెడ్డి మనకు చూపించారు. ఇప్పుడు ఆకాశంలో శాటిలైట్‌తో చేసే సైంటిఫిక్ యుద్ధాన్ని మన కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘అంతరిక్షం’. ‘9000 కేఎంపీహెచ్’ అనేది ట్యాగ్‌లైన్. లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సత్యదేవ్, రాజా, శ్రీనివాస్ అవసరాల, రెహ్మాన్ ముఖ్యపాత్రల్లో కనిపిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్‌లుక్, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన ట్రైలర్.. ఆ ఆసక్తిని, అంచనాలను మరింతగా పెంచేస్తోంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. కక్ష్యలోకి పంపిన ఓ శాటిలైన్‌లో సమస్య తలెత్తడం, దానిని సరిచేసేందుకు సైంటిస్ట్ దేవ్ రంగంలోకి దిగడం, ఆ తరవాత అక్కడ ఏం జరిగింది అనేదే ప్రధాన కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘అంతరిక్షం’ చిత్రాన్ని డిసెంబరు 21న విడుదల చేయనున్నారు.