‘యాత్ర’ మూవీ రివ్యూ

Release Date :08 Feb 2019

Run Time :127 ని

Genres :బయోగ్రఫీ

Music :కే. కృష్ణ కుమార్

Director :మహి.వి.రాఘవ్

Producer :70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్

Stars :మమ్ముట్టి, జగపతి బాబు, సుహాసిని మణిరత్నం, రావు రమేష్ తదితరులు


దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర యాత్ర నేపథ్యంలో దర్శకుడు మహి.వి.రాఘవ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో వై.యస్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించారు. ప్రపంచ వ్యాప్తంగా 970 స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో విడుదలవడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కథ :

ఉమ్మడి ఏపీలో అప్పటి చంద్రబాబు పరిపాలనతో రాష్ట్రంలో రైతుల స్థితుల గతులు  ఎలా ఉన్నాయనే దానిపై ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో రైతాంగ సమస్యలు, ప్రజల కష్టాలను చూసి చలించి పోయిన వైయస్ఆర్ పాద యాత్రను చేపడతారు. ఈ సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకుంటారు. పాద యాత్ర అనంతరం వైయస్ఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో... ముఖ్యంగా ఆరోగ్య శ్రీ, ఫీజ్ రిఎంబర్స్‌మెంట్, ఆయనకు ఎలా పేరు తీసుకొచ్చాయనే అంశాన్ని చూపించారు. అలాగే తిరిగి రెండోసారి సీఎంగా కావడం, హెలికాప్టర్ ప్రమాదంలో ఎలా కన్నుమూశారనే దానిపై సినిమా సాగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

  • వై.యస్ పాద యాత్ర కథాంశం
  • మమ్ముట్టి నటన
  • ఎమోషనల్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

  • స్లో నేరేషన్
  • ఒక పార్టీకే అనుకూలంగా ఉండటం
  • మాస్ ఆడియన్స్ కోరుకునే సన్నివేశాలు లేకపోవడం

సాంకేతికవర్గాల పనితీరు :

  • అలరించే సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • కథకి తగిన విధంగా నిర్మాణ విలువలు
  • వైయస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన విజువల్స్‌ ఒరిజినల్స్ చూపించారు

తీర్పు :

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ‘యాత్ర’ సినిమా తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీలకు మింగుడుపడదనే టాక్ వినిపిస్తోంది. టోటల్ గా ఇది వైఎస్ ఆర్ ఎమోషనల్ జర్నీ చెప్పవచ్చు