విశ్వరూపం-2 మూవీ రివ్యూ

Release Date :10 Aug 2018

Run Time :141 ని

Genres :యాక్షన్‌తో కూడిన దేశభక్తి చిత్రం

Music :మొహమ్మద్ ఘిబ్రాన్

Writer :కమల్‌ హాసన్‌

Director :కమల్‌ హాసన్‌

Producer :ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌

Stars :కమల్‌ హాసన్‌, పూజ కుమార్‌, ఆండ్రియా జరిమియా, నాజర్‌, రాహుల్‌ బోస్‌, శేఖర్‌ కపూర్‌


కమల్‌ హాసన్  నటిస్తూ, దర్శకత్వం వహించిన విశ్వరూపం-2 అనగానే ఎంతో ఆసక్తి నెలకొంది. విశ్వరూపం మొదటి భాగం విడుదలకు ముందు డీటీహెచ్‌ వివాదం వచ్చిపడింది. ఆ తర్వాత ముస్లిం సోదరుల మనోభావాలను కించపరిచేదిగా ఉందంటూ తమిళనాడులో అప్పటి జయ సర్కార్ దీనిపై నిషేధం విధించారు. తాజాగా వచ్చిన విశ్వరూపం సీక్వెల్ మాతృ భాషలో విడుదల కాకపోయినా, తెలుగు(డబ్బింగ్)లో విడుదలై కాస్త ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తోంది.

ఈ చిత్రం కధ విశ్వరూపమ్ 1 ఎక్కడ అయితే ముగిసిందో అక్కడినుండి ప్రారంభం అవుతుంది. మొదటి భాగం లో ఏ ప్రశ్నలైతే మిగిలిఉన్నాయో వాటికి సమాధానం చెబుతూ రెండో భాగం సాగుతుంది. 

కథ :

వీసామ్ అహ్మద్ కాశ్మీరీ(కమల్ హస్సన్ ) ఒక RAW  ఏజెంట్. దేశాన్ని ఉగ్రవాదుల నుండి కాపాడే క్రమం లో అతను తీవ్రవాదులతో మరియు ఒమర్ (రాహుల్ బోస్) తో సన్నిహితంగా మెలుగుతూ వారి రహస్యాలను భారత దేశానికీ చేరవేస్తూ ఉంటాడు. అతని భార్య నిరుపమా  (పూజ కుమార్‌) ప్రముఖ అణుశాస్త్రవేత్త. ఈ విషయం లో అతని భార్య (అనుపమ)పూజ కుమార్ అతనికి సహకరిష్తుందా లేదా, తనను నమ్మించి మోసం చేసిన వీసామ్ పైన ఒమర్ పగ సాధిస్తాడా, వీసామ్ దేశాన్ని ఉగ్రవాదుల నుండి కాపాడగలుగుతాడా అనేది తెర పైన చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

 • కమల్ నటన
 • కెమెరా పనితనం
 • నిర్మాణపు విలువలు
 • యాక్షన్‌ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

 • మొదటి భాగం చూడని వారికి ఏమి అర్ధం కాదు
 • ప్రథమార్థంలో స్లోగా చెప్పే తీరు
 • పూజ కుమార్‌ పాత్ర కొన్నిచోట్ల అతిగా అనిపిస్తుంది.
 • వెలవెలపోయిన పాటలు

సాంకేతికవర్గాల పనితీరు :

 • హాలీవుడ్‌ చిత్రాన్ని తలపించేలా కెమెరా పనితనం
 • నిర్మాణపు విలువుల అద్భుతం
 • మొదటి భాగం తో పోల్చితే పెద్దగా ఆకట్టుకోలేకపోయిన దర్శకత్వం
 • మొదటి భాగం స్థాయికి చేరుకోలేకపోయిన యాక్షన్ సన్నివేసాను 

తీర్పు :

కమల్‌ హాసన్ నుంచి ప్రేక్షకుడు ఏమి ఆశిస్తాడో అవన్నీ ఇందులో ఉన్నాయి. మొదటి భాగం చూసినవారు, కమల్ ని చాలా కాలం తరువాత మల్లి తెరపైన చూడాలి అనుకునేవారు ఈ సినిమా చూడచ్చు.