వినయ విధేయ రామ మూవీ రివ్యూ!

Release Date :11 Jan 2019

Run Time :146 ని

Genres :ఆక్షన్ డ్రామా

Music :దేవి శ్రీ ప్రసాద్‌

Director :బోయపాటి శ్రీను

Producer :డీవీవీ దానయ్య

Stars :రామ్‌చరణ్‌, కియారా అడ్వాణీ, వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌రాజేష్‌, స్నేహ, మధుమిత, రవి వర్మ, హిమజ తదితరులు


మాస్ చిత్రాలకు చిరునామాగా నిలిచిన బోయపాటి శ్రీను. ఆయన కథల్లో అధికమైన హీరోయిజం కనిపిస్తుంటుంది. తాజాగా రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించారు. అయితే బోయపాటి డైరెక్షన్ లో మాస్‌ హీరోగా చెర్రీ ఎలా కనిపించారు? అలరించే టైటిల్‌తో వచ్చిన ఈ మాస్‌ సినిమా ఎలా ఉందనే కుతూహలం తెలుగు ప్రేక్షకుల్లో కలగడం సహజం.

కథ :

ఐదుగురు అన్నదమ్ములున్న ఫ్యామిలీలో అందరి కన్నా చిన్నవాడు రామ్ కొణిదెల. అత‌నంటే అంద‌రికీ అమితమైన ఇష్టం. అలాగే కుటుంబం అంటే రామ్ కూడా చాలా ఇష్టమే మరి. రామ్ పెద్ద‌న్న (ప్ర‌శాంత్‌) విశాఖ ఎలక్షన్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తుంటారు. అక్క‌డ జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో పందెం పరశురాం (ముఖేష్ రుషి) అరాచ‌కాల‌ను రామ్ పెద్ద‌న్న వెలికితెస్తాడు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతుంది. దీంతో పరశురాం బిహార్‌లో ఉన్న మున్నాభాయ్‌ (వివేక్ ఒబెరాయ్‌) రంగంలోకి దింపుతాడు. ఫలితంగా రామ్ కుటుంబానికి నష్టం జరుగుతుంది. దీనిని రామ్ ఎలా ఎదుర్కొన్నాడన్నిది తెర‌పై చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

  • అలరించే యాక్ష‌న్ ఎపిసోడ్లు
  • అదిరిపోయే రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు
  • బోయపాటి మాస్ ఎలిమెంట్స్‌

మైనస్ పాయింట్స్ :

  • మితిమీరినట్టున్న హింస‌
  • క‌థ‌లో అంతగా బ‌లం లేక‌పోవ‌డం

సాంకేతికవర్గాల పనితీరు :

  • ఆకట్టుకునే దేవిశ్రీ పసాద్ సంగీతం
  • కట్టిపడేసే ఫొటోగ్రఫీ
  • సినిమాకు తగిన నిర్మాణ విలువలు

తీర్పు :

పోరాట సన్నివేశాలు, సెంటిమెంట్ ను కోరుకునే ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా నిలిచిపోతుంది.