‘యూటర్న్’ మూవీ రివ్యూ

Release Date :13 Sep 2018

Run Time :129 ని

Genres :సస్పెన్స్ తో సాగే మిస్టరీ

Music :పూర్ణచంద్ర

Director :పవన్ కుమార్

Producer :శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు

Stars :సమంత, భూమిక, ఆది పినిశెట్టి


అగ్ర హీరోయిన్ సమంత  ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూ టర్న్’. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు , తమిళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులును మెప్పించేలా తీర్చిదిద్దారు.

కథ :

రచన (సమంత) టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్టర్. ఆర్కేపురం ఫ్లై ఓవర్ పై జరిగే యాక్సిడెంట్లకు సంబంధించి ఓ కథ రాయాలనుకుంటుంది. ఆ ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులను ఇంటర్వ్యూ చేస్తుంటుంది. వారిలో సుందరం ఒకడు. అతన్ని ఇంటర్వ్యూ చెయ్యటానికి అతని ఇంటికి వెళుతుంది. కానీ అప్పటికే సుందరం చనిపోతాడు. దీంతో రచనే సుందరాన్ని హత్య చేసిందని, పోలీసులు ఆమెను అనుమానించి విచారణ చేస్తారు. ఆ ఎంక్వేరిలో ఎస్ఐ నాయక్ (ఆది)కు రచన ఏ తప్పు చెయ్యలేదని తెలుస్తుంది. అయితే ఆ ఫ్లై ఓవర్ పై యూ టర్న్ తీసుకున్న వ్యక్తులే ఎందుకు చనిపోతున్నారు ? వాళ్ళందరూ ఆత్మహత్య చేసుకున్నారా ? లేదా అనేది తెలుసుకోవాలంటే ‘యూటర్న్’చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • సమంత ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ 
  • అంతర్లీనంగా చెప్పాలనుకున్న మెసేజ్ చాలా బాగుంది.
  • సప్సెన్స్ చాలా ఇంట్రస్టింగ్ గా కొనసాగుతుంది.

మైనస్ పాయింట్స్ :

  • పాయింట్ కి సరైన ట్రీట్మెంట్ రాసుకోవడంలో రచయిత విఫలం
  • వాస్తవానికి దూరంగా భూమిక చావ్లా క్యారెక్టర్

సాంకేతికవర్గాల పనితీరు :

  • నేపధ్య సంగీతం, ఎడిటర్ సురేష్ పనితరం
  • తగిన రీతిలో నిర్మాణ, సాంకేతిక విలువలు

తీర్పు :

ఈ చిత్రం రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది. సినిమాలో వచ్చే ఊహకందని సన్నివేశాలు, మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ బాగున్నాయి. సమంత అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుందంటున్నారు.