శ్రీనివాస కల్యాణం మూవీ రివ్యూ

Release Date :09 Aug 2018

Run Time :140 ని

Genres :డ్రామా ఫామిలీ రొమాన్స్

Music :మిక్కీ జే మేయర్‌

Director :సతీష్‌ వేగేశ్న

Producer :దిల్‌ రాజు, లక్ష్మణ్‌, శిరీష్‌

Stars :నితిన్, రాశి ఖన్నా, నందితా శ్వేత, ప్రకాష్ రాజ్ , జయసుధ , రాజేంద్ర ప్రసాద్ , నరేష్ VK , పూనమ్ కౌర్ , అన్నపూర్ణ , సత్యం రాజేష్


శతమానం భవతి సినిమాతో విజయం దక్కించుకున్న దర్శకుడు సతీష్ వేగేశ్న మరోసారి దిల్ రాజు నిర్మాణంలో శ్రీనివాస కళ్యాణం సినిమా రూపొందించారు. శతమానం భవతి సినిమాలో కుటుంబ బంధాలు, ప్రేమల విలువలు చెప్పిన ఆయన, ఈ సారి తెలుగింటి సాంప్రదాయాలు, పెళ్లి విలువలు ఈ తరానికి పరిచయం చేసేరీతిలో ‘శ్రీనివాస కల్యాణం’ తీర్చిదిద్దారు.

కథ :

శ్రీనివాస రాజు (నితిన్‌) ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన యువకుడు. చిన్నప్పటి నుంచి తెలుగు సాంప్రదాయలు, పెళ్లి విలువ గురించి నాన్నమ్మ (జయసుధ) చెప్పిన మాటలు వింటుంటాడు. దీంతో తన పెళ్లి కూడా నాన్నమ్మకు నచ్చినట్టుగా పండుగలా చేసుకోవాలనుకుంటాడు. చంఢీఘడ్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే శ్రీనివాస్‌కు ఆర్కే (ప్రకాష్ రాజ్‌) కూతురు శ్రీదేవి(రాశి ఖన్నా)తో పరిచయం అవుతుంది. శ్రీను కుటుంబాన్ని, సాంప్రదాయాలను గౌరవించే విధానం నచ్చిన శ్రీదేవి అతడితో ప్రేమలో పడుతుంది. పెద్దలను ఒప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే పెళ్లికి ఒప్పుకునే ముందుఆర్‌కే ఓ కండిషన్ పెడుతాడు. అంతా సవ్యంగా జరుగుతుందనే సమయంలో కథ మరిన్ని మలుపులు తిరుగుతుంది. దానిని తెరపైన చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

  • ఆకట్టుకునే కథ, కథనాలు
  • నితిన్, ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్ 
  • సినిమాటోగ్రఫీ 
  • ఎడిటింగ్ 
  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ :

  • అమ్మమ్మ పాత్రకు జయసుధను ఎంపికచేయడం
  • ఫస్టాఫ్‌లో లవ్ స్టోరికి అంతగా అవకాశం లేకపోవడం

సాంకేతికవర్గాల పనితీరు :

  • మిక్కీ జే మేయర్‌ సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోవడం
  • సమీర్‌ రెడ్డి సినిమాటోగ్రఫితో పెళ్లి వేడుకకు మరింత అందం
  • సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్న ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు 

తీర్పు :

పెళ్లికానివారు పెళ్లి చేసుకోవాలనిపించేలా, పెళ్లయిన వారు మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించేలా శ్రీనివాస కల్యాణం ఉంది. ప్రేక్షకుడి మదిలో ఈ చిత్రం ఓ పెళ్లి క్యాసెట్‌లా నిలిచిపోతుంది.