‘సిల్లీ ఫెలోస్’ మూవీ రివ్యూ

Release Date :07 Sep 2018

Run Time :122 ని

Genres :కామెడీ ఎంటర్టైనర్

Music :శ్రీ వసంత్

Director :భీమనేని శ్రీనివాస రావు

Producer :కిరణ్ రెడ్డి, భారత్ చౌదరి

Stars :సునీల్, అల్లరి నరేష్, పూర్ణ, నందిని రాయ్, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, హేమా తదితరులు


దర్శకుడు భీమినేని సినిమాలన్నీ రీమేక్ లని చెప్పుకోవచ్చు. ఈ సిల్లీ ఫెలోస్ కూడా రీమేక్ నే. తమిళంలో హిట్ అయిన ‘వెలైను వాన్ దుట్ట వెల్లైకారన్’ సినిమాకు  రీమేక్ ఈ సినిమా. కమెడియన్లు నరేష్, సునీల్ ఉండటంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చింది.

కథ :

ఓ మంత్రి చనిపోతూ అయిదు వందల కోట్ల రహస్యం ఎమ్మెల్యే జాకెట్ (జయప్రకాష్ రెడ్డి) కి చెప్పిపోతాడు. కానీ ఆ కొద్ది సేపటికే ప్రమాదం జరిగి ఎమ్మెల్యే కోమాలోకి వెళ్లిపోతాడు. కోమాలోంచి బయటకు వచ్చినా, మెమరీ లాస్ తో పదేళ్ల పిల్లాడైపోతాడు. ఇదే ఎమ్మెల్యే సామూహిక వివాహాలు చేసినపుడు, నెంబర్ కోసం వీరబాబు (సునీల్)కు ఓ వేశ్యతో ఉత్తుత్తి పెళ్లి చేయించేస్తాడు. అది వీరబాబు కొంపమీదకు వస్తుంది. ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ గా వుండే హీరో (అల్లరి నరేష్) తను ప్రేమించిన అమ్మాయికి పోలీస్ ఉద్యోగం కోసం పదిలక్షలు తీసుకువచ్చి ఎమ్మెల్యే జాకెట్ కు ఇస్తాడు. ఈ మూడు ట్రాకులు కలిస్తే సిల్లీ ఫెలోస్ కథ. అది ఎన్నిమలుపులు తిరిగిందో తెరపై చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

  • సినిమా తొలిసగం అలరించేలావుంది. 
  • రెండు పాటలు క్యాచీగా వున్నాయి

మైనస్ పాయింట్స్ :

  • ద్వితీయార్థంలోకి వచ్చేసరికి హీరోలకు కామెడీ మైనస్
  • రెండు పాత్రలను బ్యాలెన్స్ చేసుకోవడంలో దర్శకుడు విఫలం
  • అలవాటైపోయిన బాడీ లాంగ్వేజ్ లు, డైలాగ్ డెలివరీ

సాంకేతికవర్గాల పనితీరు :

  • సినిమాటోగ్రఫీ ఓకె
  • తగిన రీతిలో సాంకేతిక సహకారం 

తీర్పు :

టోటల్ గా ఓ మాంచి కామెడీ సినిమా చూసిన ఫీలింగ్ అయితే మాత్రం కలుగదంటున్నారు. జస్ట్ అలా అలా రెండు గంటలు టైమ్ పాస్ అయిపోయే సినిమా అన్న చాయిస్ తీసుకుంటే సిల్లీ ఫెలోస్ గట్టెక్కుతుందంటున్నారు.