‘సవ్యసాచి’ సినిమా రివ్యూ

Release Date :02 Nov 2018

Run Time :150 ని

Genres :థ్రిల్లింగ్ డ్రామా

Music :ఎంఎం కీరవాణి

Director :చందు మొండేటి

Producer :నవీన్ యర్నేని, సీవీ మోహన్, వై రవిశంకర్

Stars :అక్కినేని నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, వెన్నెల కిషోర్


మైత్రీ మూవీ మేకర్స్ మూండంటే మూడు సినిమాలతో టాలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థగా పేరొందింది. అలాంటి పెద్ద బ్యానర్ నుంచి అక్కినేని నాగచైతన్య హీరోగా సినిమా వస్తోందనడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. ‘కార్తికేయ’ లాంటి వైవిధ్య చిత్రాన్ని తెరకెక్కించిన చందు మొండేటి దర్శకుడు కావడంతో ఏదో కొత్తదనం ఉంటుందనుకుంటున్నారు. పైగా ఈ సినిమాకు టైటిల్ ‘సవ్యసాచి’ అని ప్రకటించినప్పుడు అంచనాలు మరింతగా పెరిగాయి.

కథ :

‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ అనే లోపాన్ని ఆధారంగా చేసుకుని అల్లుకున్న కథే ‘సవ్యసాచి’ చిత్రం. తల్లి గర్భంలో ఏర్పిడిన కవల పిండాలు పోషకాహార లోపం వల్ల ఒకటిగా కలిసిపోవడమే ఈ లోపం. ఇదే లోపంతో విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య) పుడతాడు. అయితే విక్రమ్ ఆదిత్య ఒకరు కాదు.. అతనిలోని రెండో వ్యక్తి ఆదిత్య. అతను బయటికి కనిపించకపోయినా న్యూరాన్ల రూపంలో విక్రమ్ మెదడు, ఎడమ చేతిలో దాగి ఉంటాడు. అతనికి అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. వాటిని విక్రమ్ తన ఎడమచేతితో ప్రదర్శిస్తుంటాడు. మరోవైపు అరుణ్ రాజ్(మాధవన్) ఎంతో మేధావి. అయితే తాను కావాలనుకున్నదాన్ని ఎవరైనా దూరం చేసినా తట్టుకోలేడు. అతను ఏవోకారణాలతో విక్రమ్ ఆదిత్య కుటుంబాన్ని టార్గెట్ చేస్తాడు. వాళ్లని అంతం చేయాలనుకుంటాడు. విక్రమ్ బావని చంపేస్తాడు. విక్రమ్‌తో అతని అక్క(భూమిక), పాపని కూడా చంపేయాలనుకుంటాడు. అసలు అరుణ్‌ ఇలా ఎందుకు చేస్తున్నాడు? అరుణ్‌ను విక్రమ్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేది తెలుసుకోవాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • ఆకట్టుకున్న నాగచైతన్య నటన
  • ‘నిన్ను రోడ్డు మీద’ పాటలో చైతూ డ్యాన్స్ అదుర్స్
  • ‘ఎడమచేతి’ ఎమోషన్‌
  • నిధి అగర్వాల్ న‌ట‌న‌

మైనస్ పాయింట్స్ :

  • కొత్త కాన్సెప్ట్‌‌‌ను దర్శకుడు సరిగా వాడుకోలేదు
  • పేలవంగా సెకండాఫ్‌లో విలన్, హీరోల మధ్య గేమ్

సాంకేతికవర్గాల పనితీరు :

  • ఆకట్టుకున్న కీరవాణి నేపథ్య సంగీతం
  • జె.యువరాజ్ సినిమాటోగ్రఫీ
  • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు 

తీర్పు :

ఇదొక వైవిధ్యమైన చిత్రం. వినోదం, భావోద్వేగం, యాక్షన్ ఇలా అన్ని అంశాలన్నీ ఉన్నాయి. దీనికి మంచి కథనం తోడై ఉంటే ఇంకా బాగుండేదంటున్నారు. కొత్తదనం కోరుకునేవారకి నచ్చే చిత్రం.