‘శైలజారెడ్డి అల్లుడు’ మూవీ రివ్యూ

Release Date :13 Sep 2018

Run Time :148 Minutes

Genres :ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

Music :గోపి సుందర్

Director :మారుతి

Producer :రాధాకృష్ణ, నాగ వంశీ, పీడీవీ ప్రసాద్

Stars :నాగ చైతన్య, అను ఇమాన్యుల్, రమ్య కృష్ణన్, నరేష్, వెన్నెల కిషోర్, పృథ్వీ & తదితరులు


అత్తా, అల్లుళ్ల‌ది సినిమాలకు సంబంధించి ఎవ‌ర్ గ్రీన్ ఫార్ములా.  వీటిపై ఎన్ని క‌థ‌లొచ్చినా ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతూనే ఉంటారనేది తెలిసిందే. అందుకే టాప్ స్టార్స్ అంతా అల్లుళ్ల‌గా నటించి అల‌రించారు. అయితే కాలం మారింది. అత్తా - కోడ‌ళ్ల క‌థ‌ల ట్రెండ్ వచ్చింది. ఆ కోవలోనిదే ‘శైలజారెడ్డి అల్లుడు’.

కథ :

చై (నాగ‌చైత‌న్య‌) స‌ర‌దాగా తిరిగే కుర్రాడు. తండ్రి (ముర‌ళీ శ‌ర్మ‌) ప‌ర‌మ అహంభావంతో ఉంటాడు.  చై త‌ండ్రి ఈగోనే భ‌రించ‌లేడ‌నుకుంటే.. ప్రేమించిన అమ్మాయి అను (అనూ ఇమ్మానియేల్‌) కి కూడా ఇంకొంచెం అహంభావం ఎక్కువగానే ఉంటుంది. చై ఎలాగోలా ఆమెను దారిలో పెట్టి పెళ్లాడాల‌నుకుంటాడు. తీరా చూస్తే కాబోయే అత్త శైల‌జారెడ్డి (ర‌మ్య‌కృష్ణ‌)కు ఎక్కడలేనంత అహంభావం. అటు ప్రేమించిన అను, ఇటు అత్త‌.. ఇలా ఇద్ద‌రి ఈగోల‌కూ చై బ‌ల‌వుతుంటాడు. వీరిద్ద‌రినీ చై ఎలా మార్చాడు? వాళ్ల‌లోని అహంభావాన్ని ఎలా పోగొట్టాడనేదే ‘శైల‌జారెడ్డి అల్లుడు’ క‌థ‌. తెరపై ప్రతీ సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంటుంది. 

ప్లస్ పాయింట్స్ :

  • చై అందంగా, చ‌లాకీగా న‌టించాడు. స్క్రీన్ ప్ర‌జెన్స్ అద్భుతం 
  • ర‌మ్య‌కృష్ణ క‌నిపించిన‌ప్పుడ‌ల్లా తెర‌కే ఓ నిండుద‌నం వస్తుంది.

మైనస్ పాయింట్స్ :

  • ఫ‌స్టాఫ్ చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది.
  • దర్శకుడు మారుతి స్థాయి వినోదం ప్రేక్షకులను కనిపించదు. 
  • మారుతి డైలాగ్ రైట‌ర్‌గా ఆకట్టుకోలేదు.

సాంకేతికవర్గాల పనితీరు :

  • కెమెరా మెన్ కి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి.
  • తగిన రీతిలో నిర్మాణ, సాంకేతిక సహకారం. 

తీర్పు :

మారుతి నుంచి ఆశించే వినోదం ఈ సినిమాలో బాగా త‌గ్గిపోయింది. ఫ‌న్ ఎలిమెంట్‌ని ఇంకాస్త జోడించి ఉంటే.. ఈ సినిమాకి  యావ‌రేజ్ మార్కులు పడేవి . రమ్యకృష్ణ నటన, చైతూ చలాకీతనం చూసేందుకు సినిమాకు వెళ్లవచ్చు .