`రోబో 2 .0` మూవీ రివ్యూ

Release Date :29 Nov 2018

Run Time :146 ని

Genres :ఆక్షన్ థ్రిల్లర్

Music :ఏఆర్‌ రెహమాన్‌

Director :శంకర్‌

Producer :ఎ.సుభాష్‌కరణ్‌, రాజు మహాలింగం

Stars :రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, అమీ జాక్సన్‌, సుదాంశు పాండే, అదిల్‌ హుస్సేన్‌, కళాభవన్‌ షాంజాన్‌ తదితరులు


500 కోట్లకుపైనే పెట్టుబ‌డి పెట్టి రూపొందించిన రజినీ సినిమా ఇది. సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కింది. త‌ర‌చూ వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాఅభిమానులు ఈ సినిమా కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురుచూశారు. వారి నిరీక్షణ ఫ‌లించింది. 2.ఓ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చేసింది. 

కథ :

అంద‌రి సెల్‌ఫోన్లూ ఉన్నట్టుండి మాయ‌మైపోతుంటాయి. ఈ హఠాత్పరిణామానికి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతుంది. ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్లని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు తెలుసుకుంటారు. అయితే సెల్‌ఫోన్‌ల‌న్నీ అమ‌ర్చుకున్న ఓ ప‌క్షి న‌గ‌రంలో చొర‌బ‌డి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దాన్ని ఆపడానికి శాస్త్రవేత్తలు నిర్ణయం తీసుకుంటారు. చిట్టి ‘ద రోబో’ని మ‌ళ్లీ రంగంలోకి దింపుతారు. మరి చిట్టి ఏం చేశాడన్నదే సినిమా.. దీనిని తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • చిట్టి - ప‌క్షిరాజు పోరాట దృశ్యాలు
  • అద్భుతమైన విజువ‌ల్ ఎఫెక్ట్స్‌
  • ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ అదుర్స్

మైనస్ పాయింట్స్ :

  • షాకింగ్ ఎలిమెంట్స్ అతి తక్కువగా ఉన్నాయి.
  • ఎమోష‌న్స్‌లో లోపించిన బలం

సాంకేతికవర్గాల పనితీరు :

  • హాలీవుడ్ స్థాయిలో విజువ‌ల్ ఎఫెక్ట్స్ 
  • ఆర్‌.ఆర్‌లో రెహ‌మాన్ మార్క్
  • కేవ‌లం టెక్నాల‌జీనే నమ్ముకున్నారు

తీర్పు :

ఒకవైపు రజినీ అభిమానులను, మరోవైపు కొత్తదనాన్ని కోరుకునేవారిని అలరించే సినిమా.