పేపర్ బాయ్ మూవీ రివ్యూ

Release Date :31 Aug 2018

Run Time :1hr 47 mins

Genres :రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌

Music :భీమ్స్ సిసిరోలియో, నేపథ్య సంగీతం; సురేష్ బొబ్బిలి

Writer :సంపత్ నంది

Director :జయశంకర్,

Producer :సంపత్ నంది, రాములు, వెంకట్, నరసింహ

Stars :సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్య హోప్, పోసాని కృష్ణ మురళి, అభిషేక్ మహర్షి తదితరులు


'రచ్చ', 'బెంగాల్ టైగర్', 'గౌతమ్ నంద' వంటి కమర్షియల్ సినిమాల దర్శకుడు సంపత్ నంది కథ అందించిన సినిమా 'పేపర్ బాయ్'. మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్ర హీరోలు ప్రచారంలో సహకరించడంతో 'పేపర్ బాయ్' మీద ప్రేక్షకుల దృష్టి మళ్లింది.

కథ :

రవి (సంతోష్ శోభన్) పేపర్ బాయ్. అతడి తండ్రి ఆటో డ్రైవర్. తల్లి నాలుగు ఇళ్లల్లో వంటపని చేస్తుంటుంది. బీటెక్ చదివిన రవికి పుస్తకాలు చదవడం అంటే ప్రాణం. ధరణి (రియా సుమన్)కి అదే అలవాటు. పుస్తకాల ద్వారా పరిచయమైన ఆమెను రవి ప్రేమిస్తాడు. అతడి భావాలు నచ్చిన ధరణి కూడా ప్రేమలో పడుతుంది. పెళ్లికి ఇరు కుటుంబాల వారు అంగీకరిస్తారు. ఇంతలో రవి కుటుంబం తాముంటున్న హైదరాబాద్ వదిలి వెళ్తుంది. ఇలా రవి తాను ప్రేమించిన ధరణిని ఎందుకు వదిలి వెళ్లాడనేది తెలుసుకోవాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ
  • సంతోష్ శోభన్ నటన, వాయిస్
  • సందర్భానుసారంగా సంపత్ నంది రాసిన కొన్ని సంభాషణలు

మైనస్ పాయింట్స్ :

  • కథ, కథనం
  • హీరోయిన్ రియా సుమన్, ఆమె నటన, ఆమెకు చెప్పిన డబ్బింగ్
  • ప్రేమలో ఎలా పడ్డారనే సన్నివేశాలు బలంగా లేకపోవడం
  • భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరువయ్యేలా చిత్రీకరించకపోవడం

సాంకేతికవర్గాల పనితీరు :

  • సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ కృషి ప్రతి ఫ్రేములో కనిపిస్తుంది.
  • నిర్మాణ విలువలు బావున్నాయి.

తీర్పు :

కథలో ట్విస్టులు ఏవీ లేవు. దానికి తోడు కథనం నెమ్మదిగా సాగింది. కథనం నాగార్జున 'శివమణి' చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. చక్కటి సంభాషణలు కోరుకునేవారిని సినిమా అలరిస్తుంది.