`పందెంకోడి 2` మూవీ రివ్యూ

Release Date :18 Oct 2018

Run Time :150 ని

Genres :యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్

Music :యువ‌న్ శంక‌ర్ రాజా

Director :ఎన్‌.లింగుస్వామి

Producer :విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతిలాల్‌ గడా

Stars :విశాల్‌, కీర్తిసురేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, రాజ్‌కిర‌ణ్, హ‌రీష్ పేర‌డే, గంజా క‌రుప్పు త‌దిత‌రులు


`ప్రేమ చద‌రంగం`తో సినీ కెరీర్‌ను స్టార్ చేసిన విశాల్‌కు రెండో సినిమా `సండైకోళి`. లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం విశాల్‌కు యాక్ష‌న్ హీరోగా మంచిఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. తెలుగులోఅది `పందెంకోడి` అనే పేరుతో విడుద‌లై పెద్ద విజ‌యాన్ని సాధించింది. దీంతో విశాల్‌కు తెలుగులో అభిమానులు ఏర్పడ్డారు. ఆ త‌ర్వాత విశాల్‌కు భ‌ర‌ణి, పొగ‌రు చిత్రాలు కూడా తెలుగులో విజ‌యాన్ని సాధించి మాస్ హీరోగా పేరు తెచ్చిపెట్టాయి. ఈ రోజు విడుదలలై పందెంకోడి-2 పై అనేక అంచనాలు నెలకొన్నాయి.

కథ :

ఇరు గ్రామాల మద్య తలెత్తిన వివాదంలో ఒక వ్యక్తి హత్య జరుగుతుంది. అతని భార్య భ‌వాని(వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌) త‌న భర్త‌ను చంపిన వ్య‌క్తి కుటుంబంపై క‌క్ష పెంచుకుంటుంది. వారి కుటుంబంలో అంద‌రినీ చంపేస్తుంది. ఓ కుర్రాడిని మాత్రం చంప‌కుండా వ‌దిలేస్తారు. ఈ గొడ‌వ‌ల కార‌ణంగా ఏడు గ్రామాల జాత‌ర ఏడేళ్లు ఆగిపోతుంది. మిళ్లీ ఏడు గ్రామాల పెద్ద‌ల‌తో క‌లిసి మ‌ళ్లీ జాత‌ర‌ను ఘ‌నంగా చేయాల‌నుకుంటారు. అదే జాత‌ర భ‌వాని త‌న భ‌ర్త‌ను చంపిన కుటుంబంలో మిగిలిపోయిన కుర్రాడిని చంపాల‌ని నిశ్చయించుకుంటుంది. కానీ రాజా రెడ్డి ఆ కుర్రాడి కాపాడుతాన‌ని మాట ఇస్తాడు. అదే స‌మ‌యంలో విదేశాల్లో ఉంటున్న బాలు(విశాల్) జాత‌ర‌ను చూడ‌టానికి ఊరొస్తాడు. ఊర్లోనే చారుల‌త‌(కీర్తిసురేశ్‌)ను ప్రేమిస్తాడు. అదే స‌మ‌యంలో భ‌వాని, ఆమె మ‌నుషులు ఆ కుర్రాడిని చంపాల‌నుకుంటారు. అప్పుడు అప్పుడు బాలు ఏం చేస్తాడు? అనేది తెలియాంటే సినిమా చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

  • ఆకట్టుకునే విశాల్ న‌ట‌న‌
  • లింగుస్వామి టేకింగ్‌
  • కీర్తిసురేశ్ న‌ట‌న‌

మైనస్ పాయింట్స్ :

  • సినిమా మొదలైన కొద్ది సేప‌టికే మెయిన్ ఎలిమెంట్ తీరు తెలిసిపోతుంది
  • క‌థంతా ఒక పాయింట్ చుట్టూనే తిరుగుతుంటుంది.

సాంకేతికవర్గాల పనితీరు :

  • అలరించే బ్యాగ్రౌండ్ స్కోర్
  • కెమెరా వ‌ర్క్‌
  • సినిమాటోగ్ర‌ఫీ ఓకే. నిర్మాణ విలువ‌లు 

తీర్పు :

రివేంజ్ డ్రామానే అయినా దర్శకుడు ఆస‌క్తిక‌రంగా తెర‌కెక్కించాడు. జాత‌ర‌లో విశాల్ ఫైట్‌తో పాటు విశాల్ తండ్రికి ఇచ్చిన మాట‌ను కాపాడుకునే క్ర‌మంలో తీసుకునే నిర్ణయాలు ఆక‌ట్టుకుంటాయి. మాస్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.