‘పడి పడి లేచె మనసు’ రివ్యూ

Release Date :21 Dec 2018

Run Time :2 hr 40 ని

Genres :రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌

Music :విశాల్ చంద్రశేఖర్

Director :హను రాఘవపూడి

Producer :సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి

Stars :శర్వానంద్, సాయి పల్లవి, మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, ప్రియ రామన్ త‌దిత‌రులు


మంచి క‌థలను ఎంచుకోవడంతోపాటు ఎటువంటి పాత్రనయినా అవ‌లీల‌గా చేయ‌గ‌ల‌డ‌ని శ‌ర్వానంద్‌ పేరుతెచ్చుకున్నాడు. తన ముఖ క‌వ‌ళిక‌ల‌తో, చ‌లాకీత‌నంతోనూ మెప్పించ‌గ‌ల‌దనే పేరు తెచ్చుకుంది సాయిపల్ల‌వి. ల‌వ్‌స్టోరీలను చక్కగా తెర‌కెక్కించ‌గ‌ల‌డ‌నే పేరు తెచ్చుకున్నాడు హ‌ను రాఘ‌వ‌పూడి. వీరి ముగ్గురి కాంబినేషన్లో వచ్చిన సినిమానే ‘పడిపడి లేచే మనసు’. దీంతో ఈ సినిమాపై హైప్ నెలకొంది.

కథ :

సూర్య రావిపాటి (శ‌ర్వానంద్‌) ఫుట్‌బాల్ ఆటగాడు‌. అత‌నికి డాక్ట‌ర్ వైశాలి (సాయిప‌ల్ల‌వి) అంటే ఎంతో ఇష్టం. వైశాలి తండ్రి మేజిస్ట్రేట్‌. తరువాతి కాలంలో వైశాలికి సూర్య అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఒక‌రిని ఒక‌రు  ప్రేమించుకుంటారు. ఒకసారి క్యాంప్ కోసం ఖాట్మండుకు వెళ్తుంది వైశాలి. దీంతో సూర్య కూడా ఖాట్మండుకు వెళ్తాడు. అక్క‌డ అనుకోకుండా సూర్య త‌న తండ్రిని క‌లుస్తాడు. తరవాత కథ అనేక ములుపులు తిరుగుతుంది. సూర్య వైశాలిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేదే కథాంశం.

ప్లస్ పాయింట్స్ :

  • శ‌ర్వానంద్‌, సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌ అదుర్స్
  • అద్భుతమైన లొకేష‌న్లు
  • అక్క‌డ‌క్క‌డా మెప్పించే డైలాగులు

మైనస్ పాయింట్స్ :

  • కామెడీ అంతగా లేదు
  • స‌న్నివేశాల్లో కొత్త‌ద‌నం కనిపించదు
  • ఎక్కువ సాగ‌దీత‌గా అనిపిస్తుంది

సాంకేతికవర్గాల పనితీరు :

  • బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ బాగుంది
  • ఆకట్టుకునే నిర్మాణ విలువలు 

తీర్పు :

ప్రేమ కథ అయినా భావోద్వేగాలు అంతగా పండలేదు, శర్వానంద్, సాయిపల్లవి అభిమానులను అలరించే చిత్రం