ఒడియన్‌ మూవీ రివ్యూ

Release Date :14 Dec 2018

Run Time :167 ని

Genres :ఆక్షన్ థ్రిల్లర్

Music :ఎం. జయచంద్రన్‌

Director :వి.ఏ. శ్రీకుమార్‌ మీనన్‌

Producer :ఆంటొని పెరుంబవూర్‌, రామ్‌ దగ్గుబాటి

Stars :మోహన్‌లాల్‌, ప్రకాష్‌రాజ్‌, మంజు వారియర్‌, సన అల్తాఫ్‌, సిద్ధిక్‌ తదితరులు


మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన లేటెస్ట్‌ అడ్వెంచర్‌ మూవీ 'ఒడియన్‌'. తెలుగులోకి అనువాదమైన ఈ చిత్రం మలయాళ వెర్షన్‌తో పాటుగా విడుదలయింది. ఈ చిత్రంపై అనేక అంచనాలు నెలకొన్నారు.

కథ :

వంశ పారంపర్యంగా వచ్చిన విద్యలతో ఒడియన్‌గా జీవనం సాగిస్తోన్న 'మాణిక్యం' (మోహన్‌లాల్‌) కథే ఇది. చిన్నతనం నుంచి తాను ఆరాధించిన ప్రభ (మంజు వారియర్‌) కుటుంబానికి అండగా వుంటూ, ఎవరినైనా భయపెట్టే పనులొస్తే అవి చేసుకుంటూ వుంటాడు ఒడియన్‌ మాణిక్యం. ప్రభపై కన్ను వున్న ఆమె బావ రాజారావు (ప్రకాష్‌రాజ్‌) ఆమెని తన సొంతం చేసుకోవడానికి చాలా పన్నాగాలు పన్నుతూ ఒడియన్‌ ఊరిలోనుంచి వెళ్లిపోయేట్టు చేస్తాడు. ప్రభ ప్రాణాలకి ప్రమాదం వుందని తెలిసి మళ్లీ తిరిగి వచ్చిన ఒడియన్‌ ఏం చేస్తాడు? అనేదే సినిమా...

ప్లస్ పాయింట్స్ :

  • మోహన్‌లాల్‌ యంగ్‌ ఒడియన్‌గా అలరించాడు
  • ప్రకాష్‌రాజ్‌ పర్‌ఫార్మెన్స్‌
  • మంజు వారియర్‌ పర్‌ఫార్మెన్స్‌

మైనస్ పాయింట్స్ :

  • వాస్తవాతీతంగా వున్న యాక్షన్‌ ఎపిసోడ్స్‌

సాంకేతికవర్గాల పనితీరు :

  • చిత్రానికి ప్రధానాకర్షణ ఛాయాగ్రహణం
  • అద్భుతమైన టెక్నికల్‌ వాల్యూస్‌

తీర్పు :

ఆసక్తికరమైన కాన్సెప్ట్‌, మోహన్‌లాల్‌ యాక్షన్ కోసం చూడాల్సిన సినిమా!