రివ్యూ: ఎన్టీఆర్ - మ‌హానాయ‌కుడు

Release Date :22 Feb 2019

Run Time :128 ని

Genres :బయోగ్రఫీ డ్రామా

Music :ఎం.ఎం.కీరవాణి

Director :క్రిష్ జాగర్లమూడి

Producer :నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి

Stars :బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, ఆమని, కల్యాణ్‌రామ్‌, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా తదితరులు


మహానటుడు, నాయకుడు నందమూరి తారకరామారావు జీవితాన్ని దర్శకుడు క్రిష్ రెండు భాగాలుగా రూపొందించారు. దీనిలోని మొదటి భాగాన్ని ‘కథానాయకుడు’ పేరుతో  మొన్న సంక్రాంతికి విడుదల చేశారు. ఇప్పుడు ‘మ‌హా నాయ‌కుడు’ పేరుతో రెండవ భాగాన్ని విడుదల చేశారు. క‌థానాయ‌కుడులో ఎన్టీఆర్ సాధించిన అపూర్వ విజ‌యాల‌ను చూపించగా,  మ‌హా నాయ‌కుడులో ఆయ‌న సాగించిన జైత్ర యాత్ర‌ను చూపించే ప్రయత్నం చేశారు.

కథ :

నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ‘తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నా’ అనే రాజ‌కీయ ప్ర‌క‌ట‌న చేయ‌డంతో ‘క‌థానాయ‌కుడు’ చిత్రం ముగుస్తుంది. తరువాత ఆయన రాజ‌కీయ ప్ర‌స్థానం ఎలాసాగించారనేది ‘మ‌హానాయ‌కుడు’లో చూపించారు. పార్టీని ప్ర‌క‌టించిన అనంతరం 9 నెల‌లోగానే ఆయ‌న అధికారంలోకి ఎలా వచ్చారు?  అప్ప‌టి ఇందిరాగాంధీ హవాకు ఎలా అడ్డుకట్టు వేయగలిగారు? అనే అంశాలు మహానాయకుడులో చూపించారు.  ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సుని త‌గ్గించ‌డంతో ఆయ‌న ఎదుర్కొన్న విమర్శలను, ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకోవాల్సివ‌చ్చిందీ చూపించారు.  అలాగే నాదెండ్ల భాస్క‌రరావు ఎన్టీఆర్ ను ఎలా మోసం చేశారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్ర‌బాబు తెలుగు దేశం పార్టీలోకి ఎందుకు చేరారనేది వివరంగా తెలియజేశారు.  ఈ సినిమా అంతా బ‌స‌వ‌తార‌కం కోణంలో తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ :

  • బాల‌కృష్ణ, విద్యాబాల‌న్‌ నటన అదుర్స్
  • చక్కగా పండిన భావోద్వేగాలు
  • ఆకట్టుకునే పొలిటిక‌ల్ డ్రామా

మైనస్ పాయింట్స్ :

  • ఎన్టీఆర్ చివ‌రి మ‌జిలీని చూపించలేదు.

సాంకేతికవర్గాల పనితీరు :

  • అలరించే ఛాయాగ్ర‌హ‌ణం
  • వీనుల విందైన నేపధ్య సంగీతం 
  • సినిమాకు తగిన నిర్మాణ విలువ‌లు

తీర్పు :

‘కథానాయకుడు’ను మించిన స్థాయిలో ‘మహానాయకుడు ఉందనే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కుటుంబ రాజకీయ చిత్రంగా ఆదరణ పొంతుందని అంటున్నారు.