'నోటా' మూవీ రివ్యూ

Release Date :05 Oct 2018

Run Time :153 ని

Genres :పొలిటికల్ డ్రామా

Music :సి.ఎస్‌.శామ్‌

Director :ఆనంద్ శంక‌ర్‌

Producer :కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా

Stars :విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ‌రీన్‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి, ఎం.ఎస్‌.భాస్క‌ర్ త‌దిత‌రులు


పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో యూత్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్న యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ హీరోగా న‌టించిన నాలుగో చిత్రం `నోటా`. ఈ చిత్రంతో త‌మిళంలో కూడా అడుగుపెట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌మిళ నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాజకీయ నేపధ్యం ఉన్న ఈ సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

కథ :

వాసుదేవరావ్‌(నాజ‌ర్‌) సిబిఐ కేసుని ఎదుర్కొనే నేపధ్యంలో త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాడు. త‌న స్థానంలో త‌న కొడుకు వ‌రుణ్‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌)ని సీఎంని చేస్తాడు. ఇంతలో సిబిఐ కేసు కార‌ణంగా వాసుదేవరావ్ జైలు కెళ్తాడు వాసుదేవ‌రావ్‌. ముందు సీఎం ప‌ద‌విని బాధ్య‌త‌గా ప‌ట్ట‌ని వ‌రుణ్ త‌ర్వాత సీరియ‌స్‌గా తీసుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ప్రారంభిస్తాడు.వ‌రుణ్‌కి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మహేంద్ర (స‌త్య‌రాజ్‌) నుండి స‌హ‌కారం అందుతుంది. సరిగ్గ ఇదే సమయంలో బెయిల్‌పై విడుద‌లైన వాసుదేవరావ్‌ని చంపే ప్ర‌య‌త్నంలో భాగంగా జ‌రిగిన బాంబు దాడి కార‌ణంగా... అత‌ను కోమాలోకి వెళ్తాడు. అస‌లు త‌న తండ్రిని ఎవ‌రు చంపాల‌నుకున్నార‌నే విష‌యాల‌ను క‌నుక్కోవ‌డానికి వ‌రుణ్ ప్ర‌య‌త్నిస్తాడు. తరువాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌
  • అలరించే నేప‌థ్య సంగీతం
  • ఆర్ట్ వ‌ర్క్, అదిరిపోయే లొకేష‌న్స్ 
  • ఆక‌ట్టుకునే కీల‌క స‌న్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

  • కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ అయినట్టు తెలిసిపోతుంది.
  • హీరోయిన్ పాత్ర‌కు తగినంత స్కోపే లేదు

సాంకేతికవర్గాల పనితీరు :

  • శామ్ సి.ఎస్ ఇచ్చిన ట్యూన్స్ ఆక‌ట్టుకోలేదు.
  • నేప‌థ్య సంగీతం మాత్రం ఎక్స‌లెంట్‌. 
  • సినిమాటోగ్ర‌ఫీ ఓకే. నిర్మాణ విలువ‌లు సూపర్భ్

తీర్పు :

వ‌రుస విజ‌యాలతో ఆక‌ట్టుకున్న విజ‌య్‌దేవ‌ర‌కొండ‌ నోటా సినిమాకు పెద్ద ఎసెట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. రాజ‌కీయాల‌తో సంబంధం లేని ఓ యువ‌కుడు అనుకోకుండా రాజ‌కీయాల్లోకి రావ‌డం .. ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను ద‌ర్శ‌కుడు చ‌క్కగా చూపించాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ బాడీలాంగ్వేజ్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది.