నీవెవరో మూవీ రివ్యూ

Release Date :24 Aug 2018

Run Time :122 ని

Genres :యాక్షన్ థ్రిల్లర్‌

Music :అచ్చు రాజమణి, ప్రసన్‌

Director :హరినాథ్‌

Producer :ఎంవీవీ సత్యానారాయణ, కోన వెంకట్‌

Stars :ఆది పినిశెట్టి, తాప్సీ పన్ను, రితీకా సింగ్‌, వెన్నెల కిశోర్‌


ఆది పినిశెట్టి హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘నీవెవరో’. తమిళ సినిమా ‘అదే కంగల్‌’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి అంధుడిగా నటించారు. బాలీవుడ్‌లో నటిగా ప్రూవ్‌ చేసుకున్న తాప్సీ ‘నీవెవరో’ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆది పినిశెట్టి సోలో హీరోగా నటించిన ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు.

కథ :

చిన్నతనంలోనే కళ్లు పొగొట్టుకున్న కల్యాణ్‌ (ఆది పినిశెట్టి) తన వైకల‍్యాన్ని జయించి ఓ పాపులర్‌ రెస్టారెంట్‌కు ఓనర్ అవుతాడు‌. తానే మాస్టర్‌ చెఫ్ గా వ్యవహరిస్తుంటాడు‌.  రెస్టారెంట్‌ లో కలిసిన వెన్నెల (తాప్సీ) ప్రేమలో పడతాడు కల్యాణ్. తన ప్రేమ విషయం వెన్నెలకు చెప్పాలనుకున్న సమయంలో ఆమె ఓ ప్రాబ్లమ్‌లో ఉన్నట్టుగా తెలుస్తుంది. తరువాత కథ పలు మలుపులు తిరుగుతుంది. ఈ నేపధ్యంలో అతనికి కళ్లు రావడంతోపాటు వెన్నెలను మిస్పవుతాడు. వారిద్దిరూ కలిశారా? లేదా అనేది తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • లీడ్‌ యాక్టర్స్‌ నటన ఆకట్టుకునేలావుంది.
  • కథను ఎంతో ఆసక్తికరంగా మలిచారు.
  • సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ‘వెన్నెలా..’ పాట విజువల్‌గా సూపర్బ్

మైనస్ పాయింట్స్ :

  • స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను అందించటంలో దర్శకుడు తడబాటు
  • కథనం కూడా ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగా సాగటం
  • తేలిపోయిన సెకండ్‌ హాఫ్‌

సాంకేతికవర్గాల పనితీరు :

  • సినిమా స్థాయికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫి
  • ఆకట్టుకునే నిర్మాణ విలువలు   

తీర్పు :

స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకులకు అందించటంలో దర్శకుడు తడబడినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా థ్రిల్లర్‌ సినిమాలో ఉండాల్సి వేగం ఎక్కడా కనిపించదు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఒకసారి చూడవచ్చు .