న‌వాబ్‌ మూవీ రివ్యూ

Release Date :27 Sep 2018

Run Time :164 Min

Genres :ఆక్షన్ క్రైమ్ థ్రిల్లర్

Music :ఎ.ఆర్‌.రెహ‌మాన్‌

Director :మ‌ణిర‌త్నం

Producer :మ‌ణిర‌త్నం, వ‌ల్ల‌భ‌నేని అశోక్‌

Stars :అర‌వింద స్వామి, జ్యోతిక‌, శింబు, విజ‌య్ సేతుప‌తి, ప్ర‌కాశ్ రాజ్, అరుణ్ విజ‌య్‌, ఐశ్వ‌ర్య రాజేశ్‌, త్యాగ‌రాజ‌న్ త‌దిత‌రులు


మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వ‌స్తుందంటే సినిమా ప్రియుల‌కు పండుగలాంటిదే. చాలా కాలం త‌ర్వాత మ‌ణిర‌త్నం తెరకెక్కించిన మ‌ల్టీస్టార‌ర్ మూవీ `న‌వాబ్‌`. సినిమా పేరు వెల్లడైనప్పటి నుంచీ ప్రేక్ష‌కుల‌లో ఎంతో ఆసక్తి నెలకొంది. 

కథ :

భూపతిరెడ్డి(ప్రకాశ్‌ రాజ్‌) మాఫియా లీడర్‌. ఆయనకు చిన్నప్ప గౌడ్‌(త్యాగరాజన్‌) శత్రువు. ఓసారి భూపతిపై ఇద్దరు వ్యక్తులు పోలీసుల వేషంలో వచ్చి ఎటాక్‌ చేస్తారు. ఆ దాడిలో భూపతి, అతని భార్య(జయసుధ) తీవ్రంగా గాయపడతారు. చివరికి ఎలాగోలా ప్రాణాలతో బయటపడతారు. దీంతో భూపతి స్థానంలో ఎవరు కూర్చువాలనే దానిపై  అతని కుమారులైన...వరద(అరవిందస్వామి), త్యాగు(అరుణ్‌ విజయ్‌), రుద్ర(శింబు) మధ్య పోటీ ఏర్పడుతుంది. ఇంతలో భూపతిరెడ్డి హార్ట్‌ ఎటాక్‌తో చనిపోతాడు. త్యాగు తండ్రి కర్మ క్రియలకు రాడు. దీంతో వరద కోపం తెచ్చుకుని అతనికి వ్యాపారం కోసం ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడు. అదే సమయంలో త్యాగు ఇంట్లో పోలీస్‌ సోదాలు జరుగుతాయి. ఇదంతా వరదనే చేయించాడని త్యాగు, రుద్ర భావించి ఇండియా వచ్చే క్రమంలో వారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవేమిటనేవి తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • నటీనటులు
  • కెమెరా పనితనం
  • అలరించే నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

  • కథలో కొత్తదనం కనిపించదు.
  • మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ‘నాయకుడు’ గుర్తుకువస్తుంది.

సాంకేతికవర్గాల పనితీరు :

  • నేపథ్య సంగీతం బావుంది
  • సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ సూపర్బ్‌.
  • సినిమాకు తగిన నిర్మాణ విలువలు

తీర్పు :

మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటే గ్యాంగ్‌స్టర్స్‌ మధ్య ఎన్‌కౌంటర్స్‌ అనే కాన్సెప్టే ఉంటుంది. అయితే దీనికి కాస్త భిన్నంగా మణిరత్నం ముగ్గురు అన్నదమ్ముల మధ్య జరిగే గొడవనను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. మణిరత్నం సినిమాలను ఇష్టపడే అభిమానులను ఈ సినిమా అలరిస్తుంది.