@న‌ర్త‌న‌శాల‌ మూవీ రివ్యూ

Release Date :30 Aug 2018

Run Time :139 minutes

Genres :కామెడీ ఎంటర్‌టైనర్‌

Music :మ‌హ‌తి స్వ‌ర సాగ‌ర్

Writer :శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి

Director :శ్రీనివాస్ చ‌క్ర‌వ‌ర్తి

Producer :ఉష ముల్పూరి

Stars :నాగ‌శౌర్య‌, క‌శ్మీర ప‌ర‌దేశి, యామినీ భాస్క‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అజ‌య్‌, శివాజి రాజా, సుధ‌, ప్రియ‌, జెమిని సురేష్‌, రాకేట్ రాఘ‌వ‌ తదితరులు


నవయువ హీరో నాగ‌శౌర్య హీరోగా, నిర్మాత‌గా మారి చేసిన తొలి ప్ర‌య‌త్నం `ఛ‌లో`. ఈ సినిమాతో విజయం అందుకున్న శౌర్య చేసిన మ‌రో ప్ర‌య‌త్న‌మే `@న‌ర్త‌న‌శాల‌`. సీనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన న‌ర్త‌న‌శాల సినిమా టైటిల్‌ను పెట్ట‌డంతోపాటు, హీరో గే పాత్ర‌లో క‌నిపించ‌డంతో అస‌లు అప్ప‌టి న‌ర్త‌న‌శాల‌కు @న‌ర్త‌న‌శాల‌కు ఉన్న సంబంధం ఏమిటనే దానిపై చర్చనడవండంతో సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది.

కథ :

కళామందిర్‌ కల్యాణ్ (శివాజీ రాజా)తాను ఒక కూతుర్ని కని తన తండ్రి చేతిలో పెట్టాలని కలలు కంటుంటాడు. అయితే కల్యాణ్ తండ్రి మాత్రం... చనిపోయిన తన భార్య మనవరాలిగా తిరిగి తన ఇంట్లోనే పుడుతుందని భావిస్తుంటాడు. ఇంతలో కల్యాణ్ భార్య(ప్రియ) మగ బిడ్డకు(నాగశౌర్య) జన్మనిస్తుంది. ఈ విషయం తెలిస్తే తండ్రికి ఏమవుతుందోనని భయపడి పుట్టినది అమ్మాయేనని తండ్రిని నమ్మిస్తాడు కల్యాణ్. కొడుకును కూతురిలాగే పెంచి పెద్ద చేస్తాడు. నాగశౌర్య పెరిగి పెద్దవాడై అమ్మాయిల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఓ క్లబ్‌ను నిర్వహిస్తుంటాడు. ఓ సమస్య నుంచి మానస (కశ్మీర)ను రక్షించి, ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే అనుకోని పరిస్థితుల్లో జయప్రకాష్ రెడ్డి కూతురు సత్య(యామినీ భాస్కర్‌)ని నాగశౌర్య పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి నాగశౌర్య ఎలా బయటపడ్డాడన్నదే మిగతా కథ. 


ప్లస్ పాయింట్స్ :

  • కామెడి బాగా పండింది
  • రెండు పాటలు

మైనస్ పాయింట్స్ :

  • నాగశౌర్య గే తరహా పాత్రలో నటించే సాహసం వృథా
  • అంచనాలు అందుకోవటంలో విఫలం
  • ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది

సాంకేతికవర్గాల పనితీరు :

  • విజ‌య్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది
  • సాగ‌ర్ మ‌హ‌తి సంగీతం పరవాలేదు
  • సినిమాకు తగిన నిర్మాణ విలువ‌లు

తీర్పు :

 ఫస్ట్‌హాఫ్‌లో హీరో హీరోయిన్ల లవ్‌ స్టోరీతోపాటు కొన్ని కామెడీ సీన్స్‌ ఆకట్టుకున్నా ద్వితీయార్థం రొటీన్‌గా అనిపిస్తుంది. కథనం ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగా సాగుతూ నిరాశపరుస్తుంది. సినిమా సోసో అని చెప్పుకోవచ్చు.