నన్ను దోచుకుందువటే మూవీ రివ్యూ

Release Date :21 Sep 2018

Run Time :149 ని

Genres :కామెడీ లవ్ స్టోరీ

Music :అజ‌నీశ్ లోక్‌నాథ్‌

Director :ఆర్‌.ఎస్‌.నాయుడు

Producer :సుధీర్‌బాబు

Stars :సుధీర్‌బాబు, న‌భా న‌టేశ్‌, నాజ‌ర్‌, తుల‌సి, సుద‌ర్శ‌న్, పృథ్వీ, జీవా, వైవా హ‌ర్ష‌ త‌దిత‌రులు


సుధీర్‌బాబు సూప‌ర్‌స్టార్‌ కృష్ణ‌కు మూడో అల్లుడు. బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్‌. న‌ట‌న మీద మక్కువతో ఈ దిశగా అడుగులు వేశారు. ఇటీవ‌ల కూడా `స‌మ్మోహ‌నం`తో సూప‌ర్‌హిట్ అందుకున్నారు. తాజాగా ఓ నిర్మాణ సంస్థ‌ను నెలకొల్పి త‌న‌కు న‌చ్చిన క‌థ‌ల‌ను నిర్మించాల‌నుకున్నారు. ఆ ప్ర‌య‌త్నంలో భాగంగా ఆయ‌న వేసిన తొలి అడుగే `న‌న్ను దోచుకుందువ‌టే`.

కథ :

కార్తిక్ (సుధీర్‌బాబు) సాఫ్ట్ వేర్ ఇంజనీరు. యు.ఎస్‌.వెళ్లాల‌ని కలలు కంటుంటాడు‌. ప్రేమా, పెళ్లి మీద ఒక ఒపీనియ‌న్ లేని వ్యక్తి. దాంట్లో త‌న మేన‌మామ చెప్పిన ఓ ప్ర‌పోజ‌ల్‌ను అంగీక‌రిస్తాడు. అయితే అత‌ని మ‌ర‌ద‌లికి వేరే వ్య‌క్తితో ప్రేమ వ్య‌వ‌హారం ఉంద‌ని తెలిసి, తాను మ‌రో అమ్మాయిని ప్రేమిస్తున్న‌ట్టు తండ్రితో చెబుతాడు. తాను ప్రేమించే సాఫ్ట్ వేర్ అమ్మాయి సిరి గా ఓక షార్ట్ ఫిలిం యాక్ట్రెస్ మేఘన (న‌భా న‌టేష్‌)ని ప‌రిచ‌యం చేస్తాడు. క్ర‌మంగా కార్తిక్ ప్రేమ‌లోప‌డుతుంది మేఘన. అయితే ఆ విష‌యాన్ని చెప్పేలోపు అత‌ను  వేరే మార్గం మీద దృష్టి పెడుతున్నాడ‌ని తెలుసుకుంటుంది. మ‌రో సంద‌ర్భంలో అత‌ను రియ‌లైజ్ అయ్యే స‌మ‌యానికి మేఘన వేరే క‌మిట్‌మెంట్ చేసుకుంటుంది. మ‌రి ఒక‌రి మీద ఒక‌రికి ప్రేమ ఉన్న‌ప్ప‌టికీ, వాళ్లు విడివిడిగా బ‌తుకుతారా?  అర్థం చేరుకుంటారా అనేది తెరమీద చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • న‌టీన‌టుల ప‌నితీరు బాగుంది
  • వైవా హ‌ర్ష కామెడీ ట్రాక్‌ అదుర్స్
  • కెమెరా వ‌ర్క్‌ సూపర్బ్
  • నభా చిలిపి నటన 
  • బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ 

మైనస్ పాయింట్స్ :

  • క‌థ‌లో ఏమాత్రం కొత్త‌దనం లేదు
  • సెకండాఫ్ అంతా ఎమోష‌న్స్‌తో న‌డిపించాల‌నే ప్ర‌య‌త్నం ఎక్కువ‌గా క‌న‌ప‌డింది.
  • సంగీతం

సాంకేతికవర్గాల పనితీరు :

  • తొలి, మ‌లి పాట‌ల‌ను తీసిన విధానం బావుంది
  • నిర్మాణ, సాంకేతిక విలువలు

తీర్పు :

ఈ సినిమాలోని హీరో కార్తీకే కాదు నిజ జీవితంలోనూ చాలా మంది యువ‌త త‌మ‌కు ఏం కావాలో తెలియక.. దేనికోసం ప‌రుగులు పెడుతున్నారో అర్థం కాకుండా హ‌డావిడి ప‌డుతున్నారు. అలాంటి వారికి క‌నెక్ట్ అయ్యే సినిమా ఇది.రొటీన్ స్టోరీ అయినా పరవాలేదు కాసేపు హాయిగా నవ్వుకుందాం అనుకునేవాళ్లు తప్పక చూడచ్చు.