‘మిస్ట‌ర్ మ‌జ్ను’ రివ్యూ

Release Date :25 Jan 2019

Run Time :145 ని

Genres :కామెడీ రొమాన్స్

Music :ఎస్ తమన్

Director :వెంకీ అట్లూరి

Producer :బివిఎస్ఎన్ ప్రసాద్

Stars :అఖిల్, నిధి అగ‌ర్వాల్, ప్రియ‌ద‌ర్శి, రాజా, హైప‌ర్ ఆది, నాగ‌బాబు, సితార‌, సుబ్బ‌రాజు త‌దిత‌రులు


అఖిల్ అక్కినేని ‘హ‌లో’ లాంటి ఫ్లాప్స్ త‌ర్వాత న‌టించిన సినిమా కావ‌డంతో మిస్ట‌ర్ మ‌జ్నుపై ఎప్పటి నుంచో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. దీనికితోడు తొలిప్రేమ లాంటి హిట్ సినిమా తీసిన వెంటీ అట్లూరి ద‌ర్శ‌కుడు కావ‌డం ఈ అంచ‌నాలు పెంచేసింది. అఖిల్ కూడా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు.

కథ :

విక్కీ (అఖిల్) లండ‌న్‌లో చ‌దువుకుంటుంటాడు. క‌నిపించిన ప్ర‌తీ అమ్మాయిని త‌న మాయ‌లో ప‌డేస్తుంటాడు. అతని జీవితంలోకి అనుకోకుండా నిక్కీ(నిధి అగ‌ర్వాల్) వ‌స్తుంది. అత‌న్ని ప్రేమిస్తుంది. అయితే విక్కీది న‌ట‌న అని తెలిసిన త‌ర్వాత అతని జీవితంలోంచి వెళ్లిపోతుంది నిక్కీ. అయితే ఆ తరువాత నిక్కీని అర్ధం చేసుకుని ఆమె ప్రేమను దక్కించుకునేందుకు విక్కీ ప్రయత్నిస్తాడు. ఈ నేపధ్యంలో కథ పలు ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. అదేమిటన్నది తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • ఆకట్టుకునే అఖిల్ నటన
  • అద్భుతంగా నడిచిన ఫస్టాఫ్
  • అలరించే నృత్యాలు

మైనస్ పాయింట్స్ :

  • సాగదీసినట్టుండే సెకెండాఫ్
  • అక్కడక్కడా‘తొలి ప్రేమ’ ప్రభావం

సాంకేతికవర్గాల పనితీరు :

  • తన సంగీతంతో ఆకట్టుకున్న థమన్
  • జార్జ్ సినిమాటోగ్రఫీ అదుర్స్
  • సెకెండాఫ్ లో పేలవంగా స్క్రీన్ ప్లే

తీర్పు :

అఖిల్ ఈ సినిమాకోసం అమితంగా కష్టపడ్డాడు. ఫైనల్ గా ఈ సినిమా అఖిల్ కు ఓకేగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది.