మను మూవీ రివ్యూ

Release Date :07 Sep 2018

Run Time :182 ని

Genres :థ్రిల్ల‌ర్

Music :నరేష్ కుమ‌రన్

Director :ఫణింద్ర నర్సెట్టి

Producer :చిత్ర యూనిట్‌తో పాటు 115 మంది (క్రౌడ్ ఫండింగ్ మూవీ)

Stars :గౌతమ్, చాందిని చౌదరి, శ్రీకాంత్‌, జాన్ కొట్టొలి, మోహ‌న్ భ‌గ‌త్, అభిరామ్ వ‌ర్మ త‌దిత‌రులు.


స్టార్ క‌మెడియ‌న్ బ్ర‌హ్మానందం కుమారుడు రాజా గౌత‌మ్ హీరోగా మాత్రం పెద్ద స‌క్సెస్‌ను అందుకోలేక‌పోయారు. ‘బ‌సంతి’ స‌క్సెస్ కాక‌పోవ‌డంతో వైవిధ్య‌మైన సినిమాలు చేయాల‌ని నిర్ణయించుకున్నారు. ఆ సినిమాయే `మ‌ను`. ‘మ‌ధురం’ షార్ట్ ఫిలింతో ఫేమ‌స్ అయిన ఫ‌ణీంద్ర నార‌శెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

కథ :

మ‌ను(రాజా గౌత‌మ్‌) సియా అనే దీవిలో ఉండే పెయింట‌ర్‌. అక్కడే ఓ ఫోటో స్టూడియో న‌డుపుతూ నీల‌(చాందిని చౌద‌రి) ఉంటుంది. మ‌ను ఆర్ట్ వ‌ర్క్ అంటే నీల‌కు ఎంతో ఇష్లం. అయితే తొలిప‌రిచ‌యంలోనే ఇద్ద‌రూ గొడ‌వ ప‌డ‌తారు. త‌ర్వాత ప్రేమ‌లో ప‌డ‌తారు. ఇంతలో వీరి జీవితాల్లోకి అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని(శ్రీకాంత్‌, జాన్ కొట్టొలి, మోహ‌న్‌భ‌గ‌త్‌)ల‌తో పాటు రంగ‌(అభిరాం వ‌ర్మ‌) ప్రవేశిస్తారు. దాంతో వీరి జీవితాల్లో అనుకోని మ‌లుపులు తిరుగుతాయి అవేమిటనేది తెరపై చూడాల్సిందే.


ప్లస్ పాయింట్స్ :

  • రాజా గౌత‌మ్‌ త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు 

మైనస్ పాయింట్స్ :

  • ద‌ర్శ‌కుడు ఫ‌ణీంద్ర క‌థ‌ను అద్భుతంగా చూపించలేకపోయారు.
  • సాగ‌దీత‌గా అనిపించే స‌న్నివేశాలు

సాంకేతికవర్గాల పనితీరు :

  • విశ్వ‌నాథ్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ బాగుంది
  • న‌రేశ్ కుమర‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్

తీర్పు :

స‌న్నివేశాలు సాగే క్ర‌మం చూస్తే అసలు సినిమాకు మూడు గంట‌లు ర‌న్ టైమ్ ఎందుకు పెట్టారని అనిపిస్తుంది. థ్రిల్ల‌ర్స్‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కులకు సినిమా భారంగా తోస్తుంది.