మణికర్ణిక (ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ) రివ్యూ

Release Date :25 Jan 2019

Run Time :148 ని

Genres :ఆక్షన్ బయోగ్రఫీ డ్రామా

Music :శంకర్‌-ఇసాన్‌-లాయ్‌

Director :క్రిష్‌ జాగర్లమూడి, కంగనా రనౌత్‌

Producer :జీ స్టూడియోస్‌, కమల్‌ జైన్‌, నిశాంత్‌ పిట్టి

Stars :కంగనా రనౌత్‌, అంకితా లోఖండే, అతుల్‌ కులకర్ణి, జిషు సేన్‌గుప్తా, సురేశ్‌ ఒబేరాయ్‌ తదితరులు


కథానాయికకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించేందుకు కంగనా రనౌత్‌ ఇష్టపడుతుంటారు. ఝాన్సీ రాణిగా ఆమె నటించిన  చిత్రం ‘మణికర్ణిక-ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. టాలీవుడ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ జాగర్లమూడి, కంగనా సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజు విడుదలైంది. పలు విమర్శలు ఎదురైనా ఎటువంటి అవాంతరాలు లేకుండా ‘మణికర్ణిక’ను రూపొందించి విడుదల చేశారు. దీంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

కథ :

వారణాసిలో జన్మించిన మణికర్ణిక (కంగనా రనౌత్‌)కు ఝాన్సీ రాజ్య చక్రవర్తి గంగాధర్‌ రావు (జిషు సేన్‌గుప్తా)తో పెళ్లి జరుగుతుంది. ఆ రాజ్యానికి వెళ్లాక మణికర్ణికకు లక్ష్మీబాయిగా పేరు మారుస్తారు. సరిగ్గా అదే సమయంలో భారతదేశంలోకి చొరబడిన ఈస్ట్‌ ఇండియా ఝాన్సీ రాజ్యాన్ని వశం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంది. వీటిని లక్ష్మీబాయి తిప్పికొట్టి వారితో చర్చలకు నిరాకరిస్తుంది. దీంతో బ్రిటీష్‌ పాలకులు ఝాన్సీని ఎలాగైనా తమ అధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎలాంటి సంఘటనలు జరిగాయి, ఎటువంటి మలుపులు తిరిగాయన్నదే కథ.

ప్లస్ పాయింట్స్ :

  • కంగనా రనౌత్‌ అద్భుత నటన
  • ఆకట్టుకునే కథనం
  • దర్శకత్వం

మైనస్ పాయింట్స్ :

  • అతిగా కనిపించే విజువల్‌ ఎఫెక్ట్స్‌
  • బోరుకొట్టించే పాటలు

సాంకేతికవర్గాల పనితీరు :

  • ఆ కాలం నాటికి తీసుకువెళ్లే సినిమాటోగ్రాఫీ
  • అలరించే నేపథ్య సంగీతం
  • సినిమా స్థాయికి తగిన నిర్మాణ విలువలు

తీర్పు :

కంగనా నట విశ్వరూపానికి ప్రతీకగా ఈ చిత్రం నిలిచింది. చారిత్రక చిత్రంగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.