‘లవర్స్ డే’ మూవీ రివ్యూ

Release Date :14 Feb 2019

Run Time :145 ని

Genres :రొమాంటిక్ కామెడీ

Music :షాన్ రెహ‌మాన్‌

Director :ఒమ‌ర్ లులు

Producer :ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి

Stars :ప్రియా వారియర్, రోష‌న్‌, నూరిన్ షెరిఫ్‌, మాథ్యూ జోస‌ఫ్‌, వైశాఖ్ ప‌వ‌న‌న్‌, అన్‌రాయ్ త‌దిత‌రులు


ఒక్కసారి కన్నుగీటి ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకుని సోషల్ మీడియాలో సంచలన నటిగా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన చిత్రం  ‘లవర్స్ డే’ ఆమె నటించిన మలయాళ చిత్రం ‘ఒరు ఆదార్ లవ్’ను తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో డబ్ చేశారు. ప్రేమికుల రోజు విడుదలైన ఈ చిత్రంపై యువతలో ఎంతో క్రేజ్ ఏర్పడింది.

కథ :

ప్రియా వారియర్ (ప్రియా), రోషన్ (రోషన్), నూరిన్ షరీఫ్ (గాధ) డోన్ బాస్కో హయ్యర్ సెకండరీ స్కూల్‌ విద్యార్థులు. తొలి చూపులోనే ప్రియా వారియర్‌పై మనసు పారేసుకున్న రోషన్‌.. కొంటె చూపులు, చిలిపి చేష్టలు, గాఢ చుంబనంతో ప్రియా ప్రేమను దక్కించుకుంటాడు. గాధ ఈ ఇద్దరి ప్రేమకు సహాయపడుతుంది. రోషన్‌కి బెస్ట్ ఫ్రెండ్‌గా ఉంటుంది. అయితే రోషన్ స్నేహితుడు చేసిన ఆకతాయి పనివల్ల రోషన్ స్కూల్ నుండి సస్పెండ్ అవుతాడు. రోషన్ సస్పెండ్ కావడంతో తన పరువు పోయినట్టు భావించిన ప్రియా అతనికి బ్రేకప్ చెబుతుంది. తరువాత ఏం జరిగిందన్నది తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్ ల నటన
  • షాన్ రహ్మాన్ అందించిన పాటలు

మైనస్ పాయింట్స్ :

  • బలమైన కథనం లేకపోవడం
  • కాలేజీ రొటీన్ స్టోరీ

సాంకేతికవర్గాల పనితీరు :

  • శ్రీను సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ అద్బుతం
  • అతుకుల బొంతలా డబ్బింగ్ 
  • సినిమా స్థాయికి తగిన నిర్మాణ విలువలు 

తీర్పు :

రెగ్యులర్ కాలేజీ స్టోరీ అనే టాక్ వినిపిస్తోంది. ప్రియా వారియర్ తో హైప్ వచ్చినప్పటికీ సినిమా సహనానికి పరీక్షగా మిగిలిందంటున్నారు.