‘ఇదం జ‌గ‌త్‌’ మూవీ రివ్యూ!

Release Date :28 Dec 2018

Run Time :126 ని

Genres : క్రైమ్ థ్రిల్లర్

Music :శ్రీచరణ్‌ పాకాల

Director :అనిల్‌ శ్రీకాంతం

Producer : జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌

Stars :సుమంత్‌, అంజుకురియన్‌, సత్య, శివాజీరాజా తదితరులు


‘మ‌ళ్లీ రావా’తో ఫామ్ లోకి వ‌చ్చిన‌ సుమంత్‌ ఇప్పుడు ‘ఇదం జ‌గ‌త్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త‌న సినిమాల క‌థ‌ల‌లో వైవిధ్యం చూపించ‌డానికే ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఈసారి థ్రిల్ల‌ర్ క‌థ‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యాడు.

కథ :

నిశిత్ (సుమంత్‌) ఫ్రీ లాన్స్ రిపోర్ట‌ర్‌గా పనిచేస్తుంటాడు. రాత్రి వేళ‌లో న‌గ‌రంలో జ‌రిగే ప్ర‌మాదాల్ని రికార్డ్ చేసి, ఛాన‌ళ్ల‌కు అమ్ముకుని జీవ‌నోపాధి కల్పించుకుంటాడు. ఆ క్ర‌మంలోనే మ‌హ‌తి (అంజుకురియ‌న్‌) ప‌రిచ‌యం అవుతుంది. నిశిత్. ఓసారి రోడ్డుపై జ‌రిగిన ఓ హత్య‌ని త‌న కెమెరాలో బంధిస్తాడు. ఆ ఫుటేజ్‌తో డ‌బ్బు సంపాదించాల‌ని భావిస్తాడు. అయితే అదే అతని జీవితాన్ని మ‌లుపు తిప్పుతుంది. దీనితోపాటు మ‌హ‌తిని  దూరం చేస్తుంది. ఇంత‌కీ ఆ వీడియోలో ఏముంది? దానితో కథ ఎటువంటి మలుపులు తిరిగిందో తెలుసుకోవాలంటే వెండి తెరపై చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

  • క‌థా నేప‌థ్యం
  • హీరోహీరోయిన్ల నటన

మైనస్ పాయింట్స్ :

  • స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోవ‌డం
  • క‌థ‌ని ప్రారంభించిన విధాన‌ంలో లోపం

సాంకేతికవర్గాల పనితీరు :

  • అద్భుతమైన ఎడిటింగ్
  • సోసోగా అనిపించే నిర్మాణ విలువలు

తీర్పు :

దర్శకుడు అనుకున్న పాయింట్ బాగున్నా, చిత్రీకరణ కుదరలేదనే చెప్పాలి.లాజిక్కులు లేకుండా ఉన్న సన్నివేశాలతో అంచనాలకు దూరంగా ఉన్న ‘ఇదం జగత్’.