`హ‌లో గురు ప్రేమ‌కోస‌మే` మూవీ రివ్యూ

Release Date :18 Oct 2018

Run Time :145 ని

Genres :లవ్ ఎంటర్‌టైన్మెంట్

Music :దేవిశ్రీ ప్ర‌సాద్‌

Director :త్రినాథ‌రావు న‌క్కిన‌

Producer :శిరీష్, ల‌క్ష్మ‌ణ్‌

Stars : రామ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌ణీత‌, స‌త్య తదిత‌రులు


హీరో రామ్‌, దిల్‌రాజు కాంబినేష‌న్‌లో రూపొందిన `రామ‌రామ కృష్ణ కృష్ణ` చిత్రం త‌ర్వాత రూపొందిన సినిమా `హ‌లో గురు ప్రేమ‌కోస‌మే`. దిల్‌రాజు నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు అందించినా మంచి స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. నేను శైల‌జ త‌ర్వాత ఆ రేంజ్ స‌క్సెస్ కోసం రామ్ కూడా ఎదురుచూస్తున్నారు. నేను లోక‌ల్` చిత్రాల త‌ర్వాత‌ ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన చేసిన సినిమా కూడా ఇదే.. దీంతో సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి. 

కథ :

కాకినాడలో ఉండే సంజు (రామ్)కు తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా వుండటం తప్ప మరో లక్ష్యమేదీ ఉండదు.  మావయ్య (పోసాని)చొరవతో అతడిలో మార్పు వస్తుంది. ఉద్యోగం కోసం హైదరాబాద్ ట్రయిన్ ఎక్కుతాడు. రైల్వే స్టేషన్‌లో కాకినాడవాళ్లంటే చులకనగా మాట్లాడిన అనుపమ (అనుపమ పరమేశ్వరన్)ను భయపెడతాడు. హైదరాబాద్ చేరాక అనుపమ తన తల్లి స్నేహితుడు విశ్వనాథ్ (ప్రకాష్ రాజ్) కూతురు అని తెలుస్తుంది.  ట్ర‌యిన్‌లో చేసిన ప‌నికి సారీ చెప్పి అనుపమతో ఫ్రెండ్‌షిప్‌ చేస్తాడు. ఆఫీసులో రీతు (ప్రణీత)ను ప్రేమిస్తున్నాని అనుకుంటాడు. రీతు లవ్ ప్రపోజ్ చేసే టైమ్‌లో అనుపమను లవ్ చేస్తున్నాని సంజు తెలుసుకుంటాడు. దీంతో కథ పలు మలుపులు తిరుగుతుంది. అవేమిటో తెరపై చూడాల్సిందే

ప్లస్ పాయింట్స్ :

  • రామ్, ప్రకాష్ రాజ్ ల అద్భుత నటన
  • ప్రసన్నకుమార్ బెజవాడ రాసిన డైలాగులు, 
  • అలరించే కామెడీ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

  • రొటీన్ కథనం
  • పాటలు ఆకట్టుకునేలా లేకపోవడం
  • కామెడీపై పెట్టినంత శ్రద్ధ ఎమోషనల్ సన్నివేశాలపై పెట్టలేదు

సాంకేతికవర్గాల పనితీరు :

  • దేవిశ్రీ ప్ర‌సాద్‌ గతంలో మాదిరిగా ఆకట్టుకోలేకపోయాడు
  • సోసోగా ఉన్ననేప‌థ్య సంగీతం 
  • సినిమాటోగ్ర‌ఫీ ఓకే. నిర్మాణ విలువ‌లు సూపర్భ్

తీర్పు :

కొత్త కథ, కొత్త కథనం లాంటి అంశాల గురించి ఆలోచించకుండా సరదాగా కాసేపు నవ్వుకోవాలనుకునే వాళ్ళ కోసమే ఈ సినిమా. లాజిక్స్ గురించి కాకుండా ఎంజాయ్ చేస్తూ కాసేపు నవ్వుకుందాం అనుకునేవారు సినిమాను ఒకసారి చూడొచ్చు