గీతగోవిందం మూవీ రివ్యూ

Release Date :15 Aug 2018

Genres : రొమాంటిక్ కామెడీ

Music :గోపిసుందర్

Writer :పరుశురామ్

Director :పరుశురామ్

Producer :బన్నివాసు

Stars :విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, నాగబాబు, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, గిరిబాబు, అన్నపూర్ణమ్మ తదితరులు


ఫ్యామిలీ సినిమాలను అందంగా తెరకెక్కిస్తాడని దర్శకుడు పరశురామ్ పేరు తెచ్చుకున్నాడు. అలాగే విలువలున్న సినిమాల నిర్మాతగా బన్నీ వాసు గుర్తింపు పొందాడు. వీరిద్దరి కాంబినేషన్ లో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ సంస్థ నిర్మించిన `గీత గోవిందం` స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైంది. ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట ఆకట్టుకుంటూ ఈ సినిమాకు యూత్ ని రప్పిస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ క్రేజ్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది.

కథ :

గోవిందం(విజయ్ దేవరకొండ) ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్. గుడిలో గీత(రష్మిక మండన్న)ని చూసి ఇష్టపడతాడు. మరోవైపు గోవింద్ చెల్లెలికి పెళ్లి కుదురుతుంది. ఒకరోజు ఊరికి వెళ్లడానికి బస్సు ఎక్కిన గోవింద్కి బస్సులో గీత కనిపిస్తుంది. దీంతో గీతను చూసిన ఉత్సాహంలో విజయ్ దేవరకొండ ఆమెకు లిప్ లాక్ పెట్టేస్తాడు. విజయ్ని తప్పుగా అర్థం చేసుకున్న గీత ఈ విషయాన్ని తన అన్నయ్యకు చెబుతుంది. అయితే గీత అన్నయ్యే తన చెల్లెలకు కాబోయే భర్త అని గోవిందానికి తెలుస్తుంది. దీంతో గోవిందం ఏం చేస్తాడు? వారి కథ ఎటువంటి మలుపులు తిరుగుతుందనేది తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే!


ప్లస్ పాయింట్స్ :

  • విజయ్ దేవరకొండ నటన
  • ఇంకేం ఇంకేం కావాలనే పాట వినసొంపుగా ఉంది
  • సందర్భానుసారంగా వచ్చే హాస్య సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

  • కథలో కొత్తదనం లేకపోవడం
  • కాన్ఫ్లిక్ట్ పాయింట్ మిస్సింగ్
  • భావోద్వేగ సన్నివేశాల్లో రష్మిక తేలిపోయింది.
  • గీత.. హీరోని ఇబ్బంది పెట్టే సీన్స్ సింక్ కాలేదు. 

సాంకేతికవర్గాల పనితీరు :

  • నేపథ్య సంగీతం చక్కగా కుదిరింది 
  • మణికందన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలావుంది.

తీర్పు :

యూత్ ని ఆకట్టుకునే అంశాలన్నీ ఉన్న సినిమా. చక్కని టైంపాస్ అందిస్తుంది. కాసేపు హాయిగా నవ్వుకోవాలంటే వెంటనే ఈ సినిమా చూసేయండి మరి.