ఎఫ్‌2(ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) రివ్యూ

Release Date :12 Jan 2019

Run Time :148 ని

Genres :కామెడీ డ్రామా

Music :దేవిశ్రీ ప్రసాద్‌

Director :అనిల్‌ రావిపూడి

Producer :దిల్‌రాజు

Stars :వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, ఝాన్సీ, ప్రియదర్శి, అనసూయ, బ్రహ్మాజీ, రఘుబాబు తదితరులు


‘రాజా ది గ్రేట్‌’, ‘పటాస్‌’, ‘సుప్రీమ్‌’చిత్రాలతో దర్శకుడిగా అనిల్‌ రావిపూడి తానేమిటో నిరూపించుకున్నాడు. కామెడీ టైమింగ్‌లో వెంకటేష్‌ గురించి వేరే చెప్పనక్కర్లేదు. మరి వీరిద్దరికీ యువ కథానాయకుడు వరుణ్‌ తేజ్‌ కూడా జతకలిశాడు. ఈ ముగ్గురి కాంబినేషనల్లో వచ్చిన ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

కథ :

హారిక‌(త‌మ‌న్నా), హ‌నీ(మెహ‌రీన్‌) అక్కా చెల్లెళ్లు. వెంకీ (వెంక‌టేష్‌) ఒక ఎమ్మెల్యే ద‌గ్గ‌ర పీఏ. హారిక‌ను పెళ్లి చేసుకుంటాడు. వెంకీ జీవితం పెళ్లితో ఒక్క‌సారిగా మారిపోతుంది. భార్య‌, అత్త వెంకీని త‌మ చెప్పు చేత‌ల్లో పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయ‌త్నిస్తుంటారు. వ‌రుణ్ యాద‌వ్‌(వ‌రుణ్‌తేజ్‌) హ‌నీని ఇష్ట‌ప‌డ‌తాడు. అయితే అత్తింటి ప‌రిస్థితులకు విసిగిపోయిన వెంకీ హ‌నీని పెళ్లి చేసుకోవ‌ద్ద‌ని వ‌రుణ్‌యాద‌వ్‌కు చెబుతాడు. ప్రేమ మ‌త్తులో వ‌రుణ్‌కు ఇవేవీ ప‌ట్ట‌క హ‌నీని పెళ్లి చేసుకుంటాడు. అప్ప‌టి నుంచి కథ పలుమలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా సాగుతుంది.

ప్లస్ పాయింట్స్ :

  • వెంక‌టేష్ కామెడీ అదుర్స్
  • ఆసక్తికరంగా సాగిన ప్ర‌థ‌మార్ధం
  • డైలాగ్‌లు, నిర్మాణ విలువ‌లు

మైనస్ పాయింట్స్ :

  • పేలవంగా సాగిన ద్వితీయార్ధం
  • ఆకట్టుకోని పాట‌లు
  • క‌థ‌లో సత్తాలేకపోవడం

సాంకేతికవర్గాల పనితీరు :

  • సోసోగా సాగిన దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం
  • కెమెరా ప‌రంగా అద్భుతాలు చూపించింది
  • తగిన నిర్మాణ విలువలు

తీర్పు :

వినోదం కోరుకునే వారికి, సెలవుల్లో చక్కని సినిమా చూడాలనుకునేవారికి మంచి టైమ్ పాస్