దేవ్‌దాస్ మూవీ రివ్యూ

Release Date :27 Sep 2018

Run Time :164 Min

Genres :కామెడీ

Music :మణిశర్మ

Director :శ్రీరామ్‌ ఆదిత్య

Producer :అశ్వనీదత్‌

Stars :నాగార్జున, నాని, ఆకాంక్ష సింగ్, రష్మిక మందన్న, నరేష్ , కునాల్ కపూ త‌దిత‌రులు


 శ్రీరామ్ అదిత్య దర్శకత్వంలో భారీ తారాగణంతో వైజయంతి మూవీస్ బ్యానర్‌లో  వచ్చిన ‘దేవ్‌దాస్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగర్జున దేవ్‌గా నటించగా, నాని దాసుగా నటించాడు. రీసేంట్‌గా ‘గీతాగోవిందం’తో హిట్ అందుకున్న రష్మిక మందన్న, నానీకి జోడీగా నటించటం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది.

కథ :

డాన్ (శరత్ కుమార్ )తో కలిసి పనిచేసి ఒక పెద్ద డాన్‌గా మారతాడు దేవ(నాగార్జున). అతణ్ని పట్టుకోవటానికి  పోలీసులు అన్నిరకాలుగాప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో దేవాకి డాక్టర్ దాసు (నాని) పరిచయం అవుతాడు. దేవ, దాసుని తన బ్యాచ్‌లో చేర్చుకొని, ట్రీట్‌మెంట్‌కి ఉపయోగించుకుంటాడు. దాసు తన బ్యాచ్‌లోనే కొనసాగడంతో దేవా చేసిన ఒక హత్య వల్ల దాసు, దేవాలు విడిపోతారు. దేవా దగ్గర పనిచేసే ఒక వ్యక్తి కొడుకుకి క్యాన్సర్ అని దాసు తెలుసుకుంటాడు. తనను బతికించమని దేవాని ఆ పిల్లవాడు కోరుతాడు. దీంతో విషయం తెలుసుకున్న దేవా మనసు కరుగుతుంది. తరువాత ఏం జరిగిందనేది తెరపై చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

  • నాని, నరేష్ మధ్య వచ్చే సన్నివేశాలు
  • మణిశర్మ సంగీతం
  • అవయవ దానం కాన్సెప్ట్‌

మైనస్ పాయింట్స్ :

  • నాగర్జున కనిపించే ప్రతి సన్నివేశం ఇండ్రడక్షనా లా అనిపిస్తుంది.
  • హీరోయిన్స్‌ పాటలకు మాత్రమే పరిమితం

సాంకేతికవర్గాల పనితీరు :

  • వైజయంతి ప్రొడక్షన్ వాల్యూస్ అదుర్స్
  • అలరించే మణిశర్మ సంగీతం

తీర్పు :

కంటెంట్ లేకుండా కామెడీనే నమ్ముకోవడంతో దేవ్‌దాస్ కాస్త బోల్తా కొట్టినట్టు అనిపిస్తుంది. మొత్తంగా సినిమా రెండు మూడు సన్నివేశాలు తప్పితే మిగతాదంతా రోటిన్‌లా అనిపిస్తుంది.