‘దేవ్’ మూవీ రివ్యూ!

Release Date :14 Feb 2019

Run Time :158 ని

Genres :ఆక్షన్ అడ్వెంచర్ రొమాన్స్

Music :హరీస్ జైరాజ్

Director :రజత్ రవి శంకర్

Producer :లక్ష్మణ్ కుమార్

Stars :కార్తి, రకుల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్


‘ఆవారా’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో  కార్తీక్ ఈమధ్య వచ్చిన చినబాబు సినిమాతో  మరింత దగ్గరయ్యాడు. అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్ కు కొంతకాలంగా తెలుగు చిత్రాలలో అవకాశాలు తగ్గాయి. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమానే ‘దేవ్’. ఈ చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించారు. చినబాబు సినిమా తరువాత కార్తీ చేసిన సినిమా ఇది. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగంలో శ్రీదేవిగా కనిపించిన రకుల్ ‘దేవ్’తో మళ్లీ ప్రేక్షకులకు ముందుకువచ్చింది. 

కథ :

దేవ్ రామ లింగం మూర్తి (కార్తి) జీవితంగా ప్రతీ నిమిషాన్నీ ఎంజాయ్ చేయాలనుకునే తత్వం కలిగిన వ్యక్తి. అలాగే అడ్వెంచరస్ ట్రావెల్ అంటే ఇష్టమున్నవ్యక్తి. తనతో పాటు చిన్ననాటి స్నేహితులు విఘ్నేష్‌, నిషాలను కూడా ప్రతీ చోటికి వెంట తీసుకెళుతుంటాడు. అతనికి ఒక ప్రయాణ సందర్బంలో మేఘన (రకుల్ ప్రీత్ సింగ్) తారసపడుతుంది.  తొలి చూపుతోనే ఆమె ప్రేమలో పడతాడు. అయితే చిన్న వయసులోనే సక్సెస్‌ ఫుల్ బిజినెస్‌ ఉమెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి రకుల్. తన తల్లి జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా మగాళ్ల మీద ద్వేషం పెంచుకుంటుంది ఈ నేపధ్యంలోనే ఆమెకు తాను నచ్చలేదని తెలుసుకొని తప్పుకుంటాడు కార్తి. ఆ తర్వాత కార్తి మంచితనాన్ని గ్రహించి రకుల్ అతని ప్రేమలో పడుతుంది. తరువాత ఒక సందర్బంలో కార్తి యాక్సిడెంట్‌కు గురి అవుతాడు. తరువాత కథ ఎన్నిమలుపులు తిరిగి వారని కలిపిందో తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

  • ఆకట్టుకునే కార్తి నటన
  • రజత్ రవిశంకర్ దర్శకత్వ ప్రతిభ

మైనస్ పాయింట్స్ :

  • కథ పెద్దగా లేకపోవడం
  • సెకండాఫ్ బోరింగ్
  • స్లో నేరేషన్

సాంకేతికవర్గాల పనితీరు :

  • వేల్ రాజ్ సినిమాటోగ్రీఫీ సూపర్బ్
  • ఆకట్టు కోలేకపోయిన హారీష్ జయరాజ్
  • సినిమాకు తగిన నిర్మాణ విలువలు

తీర్పు :

ఏదో ఆశించి కార్తి సినిమాకు వెళ్లేవారిని నిరాశపరిచిందనే టాక్ వినిపిస్తోంది. ప్రకృతి అందాలను చూడాలనుకునేవారికి కనువిందు చేస్తుంది.