కంచరపాలెం మూవీ రివ్యూ

Release Date :07 Sep 2018

Run Time :151 ని

Genres :డ్రామా, రొమాన్స్

Music :స్వీకర్‌ అగస్థి

Director :వెంకటేశ్‌ మహా

Producer :సురేశ్‌ ప్రొడక్షన్స్‌, రానా దగ్గుబాటి, విజయ ప్రవీణ పరుచూరి

Stars :సుబ్బారావు, రాధా బెస్సి, మోహన్‌ భగత్‌, ప్రవీణ పరుచూరి, కార్తీక్‌ రత్నం, ప్రణీత పట్నాయక్‌, కేశవ కర్రి, నిత్యశ్రీ గోరు తదితరులు.


పక్కా తెలుగు నేటివిటీతో రూపొందిన చిత్రం 'కేరాఫ్‌ కంచరపాలెం'. ఈ సినిమా సురేశ్‌ ప్రొడక్షన్స్‌ విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమాలో గొప్పదనం ఏముంది?  హడావుడి, భారీ బడ్జెట్‌, కమర్షియల్‌ హంగులు అవసరం లేదనే విధంగా సినిమా తీయచ్చా? అనే ప్రశ్నలకు సమాధానంగా 'కేరాఫ్‌ కంచరపాలెం' నిలిచింది.

కథ :

రాజు(సుబ్బారావు) కంచరపాలెంలోని గవర్నమెంట్‌ ఆఫీస్‌లో అటెండర్‌. 49 ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. దాంతో అందరూ అతన్ని ఎగతాళి చేస్తుంటారు. అతని ఆఫీస్‌కి ఆఫీసర్‌గా రాధ(రాధ బెస్సి) వస్తుంది. రాజు మనస్తత్వాన్ని చూసిన రాధ అతన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. అయితే తన కుటుంబం ఏమని అనుకుంటుందోనని భయపడుతుంటుంది. అలాగే గడ్డం(మోహన్‌ భగత్‌) ఓ వైన్‌షాప్‌లో పనిచేస్తుంటాడు. అతను పనిచేసే వైన్‌ షాప్‌ దగ్గరు సలీమా(ప్రవీణ పరుచూరి) వచ్చి ప్రతిరోజూ మందుకొనుక్కుని వెళుతూ ఉంటుంది. గడ్డం ఆమెను ఇష్టపడతాడు. మరోకథలో అనాథ అయిన జోసెఫ్‌(కార్తీక్‌ రత్నం)ను ఊరి వ్యాయామశాల ఓనర్‌. అతనికి భార్గవి(ప్రణీత పట్నాయక్‌) పరిచయం అవుతుంది. వీరిద్దరూ ప్రేమలో పడతారు. ఇంకో కథలో ఏడవ తరగతి చదివే సుందరం(కేశవ కర్రి), తన క్లాసులోని సునీత(నిత్యశ్రీ గోరు)ని ఇష్టపడతాడు. అయితే ఉన్నట్లుండి సునీత ఊరు విడిచి వెళ్లిపోతుంది. అసలు ఈ నాలుగు కథలకు సంబంధం  ఏమిటనేది తెలుసుకోవాలంటే తెరపై సినిమా చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

  • సందర్భానుసారం వచ్చే పాటలు, నేపథ్య సంగీతం 
  • గడ్డం పాత్రలో అలరించే మోహన్‌భగత్‌ నటన

మైనస్ పాయింట్స్ :

  • ఒకరిద్దరు తప్ప అన్నీ కొత్త ముఖాలే!
  • సినిమా కూర్పులో షార్ప్‌ కటింగ్‌లు లేవు
  • మనమంతా, అ! వంటి కాన్సెప్ట్‌ మూవీలను గుర్తుకు తెస్తాయి.

సాంకేతికవర్గాల పనితీరు :

  • తక్కువ బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించిన తీరు అద్భుతం
  • వరుణ్‌ చపేకర్‌, ఆదిత్య జవ్వాది కెమెరా వర్క్‌
  • ఎక్కడా కన్‌ఫ్యూజన్‌ కాకుండా రవితేజ చక్కగా ఎడిట్‌ చేయడం.

తీర్పు :

 హృదయానికి హత్తుకునే ఎమోషనల్‌ సీన్స్‌ను బోరింగ్‌గా లేకుండా తెరకెక్కించిన విధానం అభినందనలు అందుకుంటోంది. తెలుగు సినిమా కొత్త ఫేజ్‌లో ఉంది. కొత్త కాన్సెప్ట్‌ సినిమాలు వస్తున్నాయి. చూడచక్కని చిత్రంగా ఉందనడంలో అతిశయోక్తిలేదు.