‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్’ మూవీ రివ్యూ

Release Date :28 Dec 2018

Run Time :153 ని

Genres :థ్రిల్లర్

Music :సునీల్ క‌శ్య‌ప్‌

Director :గోపీ గణేష్ పట్టాభి

Producer :ర‌మేశ్ పిళ్లై

Stars :సత్యదేవ్, నందిత శ్వేతా, పృథ్వి, బ్ర‌హ్మాజీ, ఆదిత్యామీన‌న్‌, సిజ్జు, చైత‌న్య కృష్ణ‌, జబర్దస్త్ మహేష్, ధ‌న్‌రాజ్‌, వేణుగోపాల‌రావు, ఫిష్ వెంక‌ట్‌, బ‌న్నీ చందు, `దిల్‌` ర‌మేష్‌ త‌దిత‌రులు


త‌మిళ ద‌ర్శ‌కుడు వినోద్ తెర‌కెక్కించిన చిత్రం `చ‌దురంగ‌వేట్టై`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్’గా రీమేక్ చేశారు. స‌త్య‌దేవ్ హీరోగా న‌టించాడు. మ‌నం సాంకేతికంగా ఎదుగుతున్నా, ఎక్కడో ఒక చోట మోసపోతున్నాం. ఇలాంటి నేపధ్యం కలిగిన కథతో ముడిపడినదే ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్’ చిత్రం.

కథ :

ఉత్తమ్‌ కుమార్‌ (సత్యదేవ్‌) బాల్యంలో తన తల్లిదండ్రుల మరణంతో సమాజం మీద ద్వేషం పెంచుకుని, డబ్బు కోసం ఎలాంటి మోసం చేయడానికైనా సిద్ధపడతాడు. మనం నమ్మి చేసేది ఏది మోసం కాదని భావించే ఉత్తమ్‌ రకరకాల పేర్లతో పలు మోసాలకు పాల్పడుతుంటాడు. పోలీసులు అరెస్ట్ చేసినా డబ్బుతో సాక్షాలను, లాయర్లను కోనేసి బయట పడుతుంటాడు. ఇలా అడ్డదారిలో వెళుతున్న ఉత్తమ్ మంచి వాడిగా ఎందుకు మారాడు? ఇంతకీ ఉత్తమ్‌ జీవితంలోకి వచ్చిన అవని ఎవరు? చివరికి మంచి వాడిగా మారిన ఉత్తమ్‌కు ఎదురైన సమస్యలేంటి..? అనేవి తెలుసుకోవాలంటే తెరపై చూడాల్సిందే!

ప్లస్ పాయింట్స్ :

  • న‌టీన‌టుల ప‌నితీరు
  • క‌థ‌, క‌థ‌నం

మైనస్ పాయింట్స్ :

  • అక్కడక్కడా నెమ్మదించిన కథనం

సాంకేతికవర్గాల పనితీరు :

  • ఆకట్టుకునే సినిమాటోగ్ర‌ఫీ,
  • అలరించే సంగీతం
  • అద్భుతమైన ఎడిటింగ్
  • సినిమా స్థాయికి తగిన నిర్మాణ విలువలు

తీర్పు :

ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్న మోసాలను కళ్లకు కట్టినట్టు చూపించిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. అందరినీ అలరించే సినిమా అని అంటున్నారు.