'భైరవగీత' మూవీ రివ్యూ

Release Date :14 Dec 2018

Run Time :129 ని

Genres :ఆక్షన్ డ్రామా

Music :రవిశంకర్‌

Director :సిద్ధార్థ తాతోలు

Producer :అభిషేక్‌ నామ, భాస్కర్‌ రాశి

Stars :ధనంజయ, ఇర్రామోర్‌, బాలరాజ్‌ వాడి, భాస్కర్‌ మన్యం, విజయ్‌ తదితరులు


ఉన్నవాడు లేనివాడిని బానిసగా చూస్తుంటాడు. ఇలాంటి అంతరాలున్న సమాజంలో విప్లవాలు పుట్టుకొస్తుంటాయి. ఇలాంటి ఓ అంశాన్ని తీసుకుని వర్మ, వంశీకృష్ణతో కలిసి రూపొందించిన కథే 'భైరవగీత'. వర్మ టచ్ తో వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

కథ :

రాయలసీమ ప్రాంతానికి చెందిన భైరవ(ధనంజయ) తన తండ్రి వీరయ్య బాటలో ప్రయాణిస్తూ ఊరి పెద్ద సుబ్బారెడ్డి(బాల్‌రాజ్‌ వాడి) దగ్గర పనిచేస్తూ కాలం గడుపుతుంటాడు. అయితే సుబ్బారెడ్డి బానిసలకంటే హీనంగా చూస్తుంటాడు.  సుబ్బారెడ్డి కూతురు గీత(ఐరా మోర్‌) పట్నం నుంచి ఊరికి వస్తుంది. ఆమెను కేశవ రెడ్డి(భాస్కర్‌ మన్యం) కొడుకు కట్టారెడ్డి(విజయ్‌)కి ఇచ్చి పెళ్లి చేయాలని సుబ్బారెడ్డి అనుకుంటాడు. అయితే కట్టారెడ్డి చాలా క్రూరుడు. అలాంటి వ్యక్తితో పెళ్లి వద్దని గీత తండ్రికి చెప్పినా వినిపించుకోడు. ఆమెకు భైరవ మీద ప్రేమ పుడుతుంది. దాంతో భైరవనే పెళ్లి చేసుకుంటానని తండ్రికి చెప్పేస్తుంది గీత. తరువాత కథ ఎటువంటి మలుపులు తిరిగిందనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

  • దర్శకత్వ ప్రతిభ
  • రొమాంటిక్ సాంగ్స్

మైనస్ పాయింట్స్ :

  • కథలో ఎలాంటి కొత్తదనం లేదు
  • ప్రేమ సన్నివేశాలను మోతాదు మించి చొప్పించే ప్రయత్నం
  • రొమాన్స్‌, హింస ఎక్కువయ్యాయి

సాంకేతికవర్గాల పనితీరు :

  • అద్భుతమైన సినిమాటోగ్రఫీ
  • అన్వర్‌ అలీ ఎడిటింగ్‌

తీర్పు :

బానిసత్వ, దొరతనం లాంటి అంశాలపై గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి కథ, కథనమే భైరవగీత. వర్మ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే సినిమా.