అర‌వింద స‌మేత‌ వీరరాఘవ రివ్యూ

Release Date :11 Oct 2018

Run Time :172 ని

Genres :ఫ్యాక్షన్ డ్రామా

Music :త‌మ‌న్‌

Director :త్రివిక్రమ్

Producer :ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)

Stars :ఎన్టీఆర్‌, పూజాహెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, సునీల్‌, నాగ‌బాబు, ఈషారెబ్బ‌, సుప్రియ పాత‌క్‌, న‌వీన్ చంద్ర‌, దేవ‌యాని, రావు ర‌మేష్ త‌దిత‌రులు


ఎన్టీఆర్‌-త్రివిక్రమ్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సినిమా చూడాల‌న్న స‌గ‌టు అభిమాని క‌ల ఇన్నాళ్లకు నెరవేరింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘అర‌వింద స‌మేత‌ వీరరాఘవ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ పదునైన డైలాగులు వినాలనుకునేవారికి, ఎన్టీఆర్ యాక్షన్ చూడాలనుకునేవారికి కొన్ని రోజుల ముందుగానే దసరా వచ్చేసింది. 

కథ :

వీర‌రాఘ‌వ (ఎన్టీఆర్‌) ఫ్యాక్షన్ వివాదాల్లో తండ్రి(నాగ‌బాబు)ని కోల్పోతాడు. నాయ‌న‌మ్మ మాట‌లకు ప్రభావితుడై హింస‌కు, ర‌క్తపాతానికి దూరంగా ఉండాల‌ని హైద‌రాబాద్ వచ్చేస్తాడు. అక్కడ అర‌వింద (పూజాహెగ్డే) ప‌రిచ‌యం అవుతుంది. అర‌వింద కూడా  ‘హింస వ‌ద్దు.. ర‌క్తపాతం వ‌ద్దు’ అని చెబుతుంటుంది. ఒక‌సారి అర‌వింద‌పై దాడి జ‌రుగుతుంది. అప్పుడు అర‌వింద‌ను వీర రాఘవ ర‌క్షిస్తాడు. అప్పటి నుంచి అర‌వింద‌కు సంర‌క్షకుడిగా మారిపోతాడు. ఈ నేపధ్యంలో కథ పలు మలుపులు తిరుగుతుంది. దానిని వెండి తరపై చూడాల్సిందే. 

ప్లస్ పాయింట్స్ :

  • ఎన్టీఆర్‌ న‌ట‌న‌ అదుర్స్
  • త్రివిక్రమ్ సంభాష‌ణ‌లు సూపర్బ్
  • మనసును తాకే స‌న్నివేశాలు

మైనస్ పాయింట్స్ :

  • త్రివిక్రమ్ మార్కు వినోదం అంతగా కనిపించదు

సాంకేతికవర్గాల పనితీరు :

  • తమన్ అందించిన నేపధ్య సంగీతం
  • పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ
  • ఎడిటింగ్‌లో తగ్గిన పదును

తీర్పు :

ప్రేక్షకుడు కోరుకునే అన్ని అంశాలను అరవింద సమేతలో చూపించేందుకు త్రివిక్రమ్ ప్రయత్నించాడు. ఎన్టీఆర్ హావభావాలు సినిమాకు ఎసెట్ అని చెప్పనవసరంలేదు. ప్రేక్షకులను అలరించే సినిమా అని అంటున్నారు.