అంతరిక్షం మూవీ రివ్యూ

Release Date :21 Dec 2018

Run Time :131ని

Genres :స్పేస్ థ్రిల్లర్

Music :ప్రశాంత్ విహారి

Director :సంకల్ప్‌ రెడ్డి

Producer : క్రిష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి, మురళి

Stars :వరుణ్ తేజ్, లావణ్య త్రిపాటి, అదితి రావు హైదరి తదితరులు


‘ఫిదా’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న వరుణ్ తేజ్ ఈ ఏడాది “తొలిప్రేమ” సినిమాతో మరో విజయం దక్కించుకున్నాడు. ఇదే ఊపు తో చేసిన సినిమా ‘అంతరిక్షం’.‘ఘాజీ’ ఫేం సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విడుదలైంది తెలుగులో మొదటిసారి వస్తున్న స్పేస్ ఫిలిం గా ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. 

కథ :

దేవ్ (వరుణ్ తేజ్) ఒక శిక్షణ పొందిన వ్యోమగామి. తాను సొంతంగా తయారు చేసిన విప్రయన్ అనే శాటిలైట్ ని మూన్ మీదకి పంపించాలి అనే ప్రయత్నం చేసి విఫలమవుతాడు. కాలక్రమంలో దేవ్ కి విప్రయన్ ని ఫిక్స్ చేసే ఛాన్స్ వస్తుంది. మరి ఈ సారి దేవ్ సక్సెస్ అయ్యాడా లేదా? అసలు అంతరిక్షం లో దేవ్, ఇంకా అతని టీం ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి? అనేది మిగిలిన కథ. ఇది ఎంతో ఆసక్తికరమైన మలుపులు తిరుగుతూ ఎన్నో సాంకేతిక విషయాలను తెలియజేస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • డైరెక్టర్ అపార ప్రతిభ
  • వరుణ్ తేజ్ నటన
  • ఆకట్టుకునే కథ

మైనస్ పాయింట్స్ :

  • ఫస్ట్ హాఫ్,
  • ప్రేక్షకులు అంచనా వేయగలిగే కథాకథనాలు

సాంకేతికవర్గాల పనితీరు :

  • అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  • ప్రశాంత్ విహారి సంగీతం 
  • అలాగే జ్ఞానశేఖర్ కెమెరా పనితనం

తీర్పు :

‘ఘాజీ’ సినిమా పూర్తిగా నీటి అడుగున తీసి విజయం అందుకున్న సంకల్ప్ రెడ్డి ఈ సినిమాని స్పేస్ నేపధ్యంలో తీసి ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేసాడు. కొత్తదనాన్ని కోరుకునేవారిని మెప్పించే సినిమా!